Begin typing your search above and press return to search.
కరోనా వ్యాక్సిన్ కు కొత్త సవాలుగా ‘డెన్మార్క్’
By: Tupaki Desk | 8 Nov 2020 3:30 AM GMTప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది మొదట్లో టీకా వస్తుందన్న అంచనాకు గండికొట్టే పరిణామాలు డెన్మార్క్ లో చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ కరోనా వైరస్ లో కొత్త మార్పులు చోటు చేసుకున్న వైనాన్ని అక్కడి శాస్త్రవేత్తలు కనుగొన్నట్లుగా చెబుతున్నారు. ఈ మార్పు అంతకంతకూ విస్తరిస్తే.. ఇప్పటివరకు డెవలప్ చేసిన వ్యాక్సిన్ పని చేయదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎందుకంటే.. డెన్మార్క్ లోని మింక్ అనే జీవి నుంచి కొత్త తరహా వైరస్ మనుషుల్లోకి వ్యాపిస్తున్న వైనాన్ని గుర్తించారు. నిజానికి.. మొదట్లోనే దీన్ని గుర్తించినా.. దాని తీవ్రతను అంచనా వేయటంలో విఫలమయ్యారు. ఆ దేశంలోని ఉత్తర జూట్ ల్యాండ్ మున్సిపాలిటీల్లో ఈ వైరస్ విస్తరిస్తోంది. దీంతో.. అక్కడ కొత్తగా ఆంక్షలు విధిస్తున్నారు. దీనికి కారణం ఆ ప్రాంతంలోని వందలాది ఫారంలలో ఈ మింక్ జీవుల పెంపకం చేస్తుంటారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఉత్తర డెన్మార్క్ లో ప్రధాని మెట్టీ ఫ్రెడ్రెక్సన్ అదనపు కొవిడ్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు.
దాదాపు 2.8లక్షల మందిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపించే వీలుందని చెబుతున్నారు. ఇదే నిజమైతే.. ప్రస్తుతం డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ పని చేసే అవకాశం లేదంటున్నారు. ఉత్తర జూట్ ల్యాండ్ వాసులకు ఈ వైరస్ విస్తరించకుండా ఉండేలా అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతంలోని 207 మింక్ పెంపుడు కేంద్రాల్లో కొత్త రకం కరోనా వైరస్ ను గుర్తించారు. ఈ వైరస్ విస్తరిస్తే.. 1100 పెంపుడు కేంద్రాల్లోని దాదాపు 1.7 కోట్ల మింక్ లు ఈ వైరస్ సోకే ప్రమాదం పొంచి ఉంది. ఈ ఉదంతం డెన్మార్క్ ప్రభుత్వాన్ని వణికిస్తోంది.