Begin typing your search above and press return to search.

జాగ్వార్ కోసం బీఎండబ్ల్యూని న‌దిలోకి తోసేశాడు..

By:  Tupaki Desk   |   10 Aug 2019 1:36 PM GMT
జాగ్వార్ కోసం బీఎండబ్ల్యూని న‌దిలోకి తోసేశాడు..
X
ఇప్పుడు యూత్ ఏది అనుకుంటే అది కావాలి లేదంటే వారు ఎంతకైనా తెగిస్తారు. వారికి నచ్చింది తెచ్చివ్వకపోతే వారు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక వారి రచ్చకి తల్లిదండ్రులు కూడా తలొగ్గాల్సిందే. అయితే అడిగిన గిఫ్ట్ కాకుండా వేరే గిఫ్ట్ ఇచ్చిన తండ్రికి ఓ యువకుడు పెద్ద షాక్ ఇచ్చాడు. తను జాగ్వార్ కారు అడిగితే బి‌ఎండబ్ల్యూ కారు ఇచ్చారని ఆగ్రహించిన తనయుడు ఆ కారుని నదిలోకి తోసేశాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది.

హర్యానాకి చెందిన ఓ దంపతులు తమ కుమారుడు జాగ్వార్ కారు అడిగితే బి‌ఎండబ్ల్యూ కారు కొనిచ్చారు. జాగ్వార్ అయితే రేసులోకి వెళ్ళే కారు అని , దాంతో తమ కుమారుడికి ఇబ్బంది కలగొచ్చని ఆలోచించి బి‌ఎండబ్ల్యూని గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే అడిగిన కారు కొనివ్వలేదని కుమారుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తల్లిదండ్రులకి ఓ షాక్ ఇచ్చాడు. ఆ కారుని స్నేహితులతో కలిసి బయటకు తీసుకెళ్ళాడు. ఇక అక్కడ దగ్గరలో ఉన్న ఓ నదిలోకి స్నేహితులతో కలిసి కారుని తోసేశాడు.

పైగా నదిలో పడిన కారు కొట్టుకుపోతున్న దృశ్యాలని వీడియో కూడా తీశాడు. కొట్టుకెళ్లిపోయిన ఆ కారు మధ్యలో చెత్త అడ్డంపడటంతో అక్కడ చిక్కుకుపోయింది. దీన్ని చూసిన అక్కడ స్థానిక యువకులు, గజ ఈతగాళ్ల సాయంతో బయటకి తీశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి ఓ కారు నదిలో కొట్టుకుపోతుంటే బయటకి తీశామని చెప్పుకొచ్చారు. మొత్తానికి అలా ఓ యువకుడు పెద్ద ఘనకార్యం చేశాడు.