Begin typing your search above and press return to search.
బీకేర్ ఫుల్..డెంగ్యూ కొత్త మ్యూటెంట్..11 రాష్ట్రాల్లో న్యూ వేరియంట్ కలకలం
By: Tupaki Desk | 22 Sep 2021 9:32 AM GMTరోజులు మారాయి, దోమే కదా అని నిర్లక్ష్యం చేశారో హాస్పిటల్ బెడ్ పైకి వెళ్లాల్సిందే. ఇకపై దోమ కాటుకు గురయ్యారంటే వెంటిలేటర్ వరకు వెళ్లడం ఖాయం. ఎందుకంటే, దోమలు అప్ డేట్ అయ్యాయి. మరింత శక్తివంతంగా రూపాంతరం చెందాయి. న్యూపవర్ తో జనంపై అటాక్ చేస్తున్నాయి. అవును, ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పట్నుంచి మరో లెక్క అన్నట్టుగా దోమలు మరింత పవర్ ఫుల్ గా మారాయి. డెంగ్యూ దోమలు కొత్త మ్యూటెంట్ ను తయారు చేసుకున్నాయి.
దాదాపు 11 రాష్ట్రాల్లో ఈ న్యూ వేరియంట్ ఇప్పుడు అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఏపీ, తెలంగాణతోపాటు గుజరాత్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో డెంగ్యూ కొత్త మ్యూటెంట్ బీభత్సం సృష్టిస్తోంది. న్యూ వేరియంట్ దెబ్బకు ప్రతిరోజూ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ప్రతి ఏటా సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్స్ కామన్. అయితే, ఈ ఏడాది వాటి తీవ్రత అధికంగా ఉందంటున్నారు అధికారులు. దానికి కారణం డెంగ్యూ న్యూ మ్యూటెంట్ అని చెబుతున్నారు. ప్ర
ప్రస్తుతం నమోదవుతున్న డెంగ్యూ కేసుల సంఖ్యే దీనికి రుజువు అంటున్నారు. ఆగస్ట్ వరకు డెంగ్యూ కేసుల సంఖ్య సాధారణంగా ఉంటే, సెప్టెంబర్ లో అమాంతం పెరిగిపోయాయని చెబుతున్నారు. ఈ ఏడాది జులై వరకు వివిధ రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అయితే, ఇప్పుడు దేశంలో డెంగ్యూ కొత్త మ్యూటెంట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. సెరో టైప్-2 డెంగ్యూ వేరియంట్ పై అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది.
డెంగ్యూకు వ్యాక్సిన్లు లేదా నిర్దిష్ట చికిత్సలు లేవు. రోగుల లక్షణాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది. అందువల్ల లక్షణాలు కనిపించిన వెంటనే బాధితులు వైద్యుల సలహా తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలి. ఆహారం విషయంలో శ్రద్ధ పెట్టాలి. లిక్విడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. జ్వరం, కీళ్ల నొప్పులు తగ్గించడానికి పారాసెట్మాల్ తీసుకోవచ్చు. అయితే ఆస్పిరిన్ లేదా ఇబుప్రొఫెన్ మందులు తీసుకోకూడదు. ఇవి రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతాయని డబ్ల్యూహెచ్ఓ సలహా ఇచ్చింది. సరైన వైద్య సంరక్షణ తీసుకుంటే డెంగ్యూ నుంచి బయటపడవచ్చు. మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ వ్యాధిని తేలికగా తీసుకోకూడదు.