Begin typing your search above and press return to search.

నోట్ల ర‌ద్దు దెబ్బ‌కు మావోయిస్టుల లొంగుబాట్లు

By:  Tupaki Desk   |   29 Nov 2016 7:58 AM GMT
నోట్ల ర‌ద్దు దెబ్బ‌కు మావోయిస్టుల లొంగుబాట్లు
X
ప్ర‌ధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం పోలీసుల‌కు క‌ష్టాలు త‌ప్పిస్తోంద‌ట‌. ఈ నిర్ణ‌యం దెబ్బ‌కు మావోయిస్టులు తీవ్రంగా దెబ్బ‌తిని లొంగిపోతున్నార‌ట‌. ఈ నిర్ణ‌యం వెలుడిన నాటి నుంచి అత్య‌ధికంగా 564 మంది మావోయిస్టులు లొంగిపోయార‌ని అధికారిక లెక్క‌లు చెబుతున్నాయి. చ‌త్తీస్‌ గ‌ఢ్‌ - ఒడిశా - ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ - బీహార్‌ - మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ల‌లో నిత్యం మావోయిస్టుల వేట సాగుతుంది. ఎన్ కౌంట‌ర్లూ సాధార‌ణ‌మే. కానీ... మావోయిస్టుల లొంగుబాటుకు మాత్రం పోలీసులు చాలా క‌ష్టాలు ప‌డాల్సి ఉంటుంది. ఎంతో గ్రౌండ్ వ‌ర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ, అదేమీ లేకుండానే ఇప్పుడు మావోయిస్టులు పోలీసుల‌కు లొంగిపోతున్నార‌ట‌.

రూ.500 - రూ.1000 నోట్లు ర‌ద్దు చేసిన త‌ర్వాత 28 రోజుల్లో ఏకంగా 564 మంది లొంగిపోయారు. 70 శాతం లొంగుబాట్లు మ‌ల్క‌న్ గిరి జిల్లాలోనే చోటుచేసుకున్నాయి. త‌మ వ‌ద్ద ఉన్న ర‌ద్ద‌యిన నోట్లు మార్చుకునే వీలు లేక‌పోవ‌డం, డ‌బ్బులు లేక‌పోవ‌డంతో నిత్యావ‌స‌రాలు తీర్చుకోలేక‌పోతుండ‌డంతో మ‌రో దారిలేక వారు లొంగిపోతున్న‌ట్టు పోలీసులు చెబుతున్నారు. స్థానిక కాంట్రాక్ట‌ర్లు - వ్యాపార‌వేత్త‌లు - సానుభూతిప‌రుల సాయంతో పాత‌నోట్ల‌ను మార్చుకోవాల‌ని మావోలు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని డీజీ - ఐజీల కాన్ఫ‌రెన్స్‌ లో హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ కూడా తెలిపారు.

నోట్ల ర‌ద్దుతో మావోయిస్టులు పీక‌లోతు క‌ష్టాల్లో కూరుకుపోయార‌ని, వారితో క‌లిసి ఉండ‌డం వ‌ల్ల ఎటువంటి ఉప‌యోగం ఉండ‌ద‌ని సానుభూతిప‌రులు న‌మ్ముతున్నార‌ని సీఆర్‌ పీఎఫ్ వ‌ర్గాలూ చెబుతున్నాయి. నోట్ల ర‌ద్దుతో మావోయిస్టు అగ్ర‌నేత‌ల్లో ఆందోళ‌న మొద‌లైందంటున్నారు. క్యాడ‌ర్ లొంగిపోతుండ‌డం పార్టీ ఉనికికే ప్ర‌మాదం వ‌స్తుంద‌ని ఆందోళ‌న చెందుతున్న‌ట్లుగా స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/