Begin typing your search above and press return to search.

అఖిలేష్ మొదలెట్టేశారు.. బీజేపీ మౌనం!

By:  Tupaki Desk   |   26 Dec 2016 8:12 AM GMT
అఖిలేష్ మొదలెట్టేశారు.. బీజేపీ మౌనం!
X
ఒకవైపు అంతన్న ఇంతన్న నోట్ల రద్దు బాణం కాస్తా.. లక్ష్యానికి దూరంగా తగిలిందన్న విమర్శలు - ఆర్ధిక వేత్తల అసంతృప్తి.. మరో వైపు నోట్లరద్దు వ్యవహారం వల్ల జరిగిన ఇబ్బందులు - ఎదురైన సమస్యలతో అఖిలేష్ రాజకీయ ఎత్తుగడలు దీంతో ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందస్తు ప్రచారాలు రసవత్తరంగా మారాయి. అయితే ఏ రాష్ట్రంలో అయినా ఏదైనా ప్రమాధం జరిగి మనుషుల ప్రాణాలు పోతే.. ఆ సమయంలో అధికమొత్తంలో వారికి ఆర్థిక సాయం అందించే విదంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటాయనేది తెలిసిన విషయమే. ప్రభుత్వం ఎంత ఇచ్చినా.. అంతకు మించి ఇవ్వాలనేది ఆ ప్రతిపక్షాల డిమాండ్ గా ఉంటుంటుంది. కానీ... యూపీలో మాత్రం ఆ సన్నివేశాలు కనిపించడం లేదు.

అవును... నోట్ల రద్దు అనంతర పరిణామాల్లో భాగంగా బ్యాంకుల ముందు నిలబడి మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. వీరి సంఖ్య యూపీలో 13 గా ఉంది. దీంతో వీలైనంత త్వరగా ఆ మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందేలా అఖిలేష్ చర్యలు తీసుకున్నారు. ఇదే క్రమంలో బ్యాంకు క్యూ లైన్లో నిల‌బ‌డి - అక్కడే పురిటినొప్పులు వ‌చ్చి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లికి కూడా రూ. 2 ల‌క్ష‌ల చెక్కును అందించారు. ఈ రేంజ్ లో యూపీలో నోట్ల రద్దు వ్యవహారాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించే పనిలో అఖిలేష్ దూసుకుపోతున్నారు.

ఈ విషయంలో అఖిలేష్ చేసిన పనిని సమర్ధించడానికి గానీ, వ్యతిరేకించడానికి గానీ లేదా.. మరింత ఎక్కువ మొత్తంలో ఆర్ధిక సాయం డిమాండ్ చేసే స్థితిలో కానీ అక్కడ బీజేపీ లేకపోవడం గమనార్హం. సమర్ధిస్తే ఒక తప్పు, వ్యతిరేకిస్తే మరో సమస్య.. ఇలా ముందు నుయ్యి, వెనుక గొయ్యి లా మారిపోయింది యూపీలో బీజేపీ పరిస్థితి. దీంతో ఈయ‌న బాటలోనే మ‌రికొన్ని పార్టీలు కూడా న‌డిచే అవ‌కాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే... బ్యాంకుల ముందు డ‌బ్బు కోసం నిల‌బ‌డి, ప్రాణాలు కోల్పోయినవారి గురించి భాజ‌పా ఏ సందర్భంలోనూ ప్ర‌స్థావించ‌లేదు! ప్ర‌స్థావించే పరిస్థితి కూడా వారికి ఈ సమయంలో సూట్ కాదు. దీంతో ఈ ప‌రిస్థితిని ఇత‌ర రాజ‌కీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఈ విషయంలో అఖిలేష్ ముందున్నారనే చెప్పాలి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/