Begin typing your search above and press return to search.

బాబూ... అమ‌రావ‌తి కూల్చివేతలు చెవిన‌ప‌డ్డాయా?

By:  Tupaki Desk   |   12 April 2017 10:34 AM GMT
బాబూ... అమ‌రావ‌తి కూల్చివేతలు చెవిన‌ప‌డ్డాయా?
X
తెలుగు నేల విభ‌జ‌న త‌ర్వాత క‌నీసం రాజ‌ధాని కూడా లేకుండా ఓ చిన్న ముక్క‌గా మిగిలిన నవ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ను దేశంలోనే అగ్ర‌గామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతానంటూ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాడు టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు చెప్పారు. ఆ త‌ర్వాత అదే మాట‌ను వంద‌లు, వేల సార్లు ప్ర‌స్తావిస్తున్న ఆయ‌న‌... న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధానికి అమ‌రావ‌తి అని పేరు పెట్టేసి... అందులో రికార్డు స్థాయిలో నిర్మాణాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నామ‌ని చెప్పుకొస్తున్న వైనం మ‌నంద‌రికీ తెలిసిందే. అమ‌రావ‌తికి భూమి పూజ జ‌రిగి ఇప్పటికే చాలా కాల‌మే అవుతోంది. అక్క‌డ నిర్మాణ ప‌నులు చేప‌ట్టిన కంపెనీలు షాపూర్జీ ప‌ల్లొంజీ, ఎల్ అండ్ టీలు ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో ప‌నిచేసే కంపెనీలే. ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు అందుకున్న మ‌రుక్ష‌ణ‌మే ఆ సంస్థ‌లు ప‌నులు ప్రారంభిస్తూ రికార్డు స్థాయిలో ప‌నుల‌ను పూర్తి చేస్తున్న మాట కూడా నిజ‌మే.

అయితే ఏడాదిన్న‌ర కాలంలో అమ‌రావ‌తిలో నిర్మాణం పూర్తి చేసుకున్న భ‌వ‌నాలెన్నో తెలిస్తే షాక్ తిన‌క త‌ప్ప‌దు. ఎందుకంటే... స‌చివాల‌యం - అసెంబ్లీ భ‌వ‌న స‌ముదాయాలు మాత్ర‌మే అక్క‌డ నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. అవి కూడా తాత్కాలిక భ‌వ‌నాలే. స‌రే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి నిర్మాణాల‌కు స‌రిప‌డ నిధులు లేవ‌నుకున్నా... ఇప్పుడు బాబు స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. అస‌లు అక్క‌డ నిర్దేశించుకున్న నిర్మాణాలే పూర్తి కాకుండానే కూల్చివేత‌ల‌కు తెర తేసింద‌ట‌. ఇప్ప‌టికే స‌చివాలయంలో గ‌దులు చాలా చిన్న‌విగా ఉన్నాయ‌ని, వాటితో తాము కూర్చోలేమంటూ సాక్షాత్తు బాబు కేబినెట్ స‌హ‌చ‌రులే మొండికేయ‌డంతో నాడు ప‌లు నిర్మాణాల‌ను కూల్చేసిన అధికారులు... మళ్లీ వాటిని కొత్త‌గా క‌ట్టాల్సి వ‌చ్చింది.

తాజాగా నిన్న మ‌ధ్యాహ్నం నుంచి మ‌రోమారు అక్క‌డ కూల్చివేత‌ల కార్య‌క్ర‌మం మొద‌లైంద‌ట‌. ఇప్పుడు కూల్చివేస్తున్న భ‌వ‌నం ఏమిటో తెలుసా?... ఏడారిలో ఒయాసిస్సులా స‌చివాలయం ఉద్యోగుల‌కు ఆహార ప‌దార్థాల‌ను అందించే క్యాంటీన్‌ ద‌ట‌. అయినా క్యాంటీన్ బిల్డింగ్‌ ను ఎందుకు కూలుస్తున్నారో కూడా సీఆర్డీఏ అధికారులు చెప్ప‌డం లేద‌ట‌. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం నుంచి మూడేళ్ల లీజుకు క్యాంటీన్‌ ను తీసుకుని, రూ.25 ల‌క్ష‌ల మేర ఖ‌ర్చు చేసి ఏర్పాటు చేసుకున్న క్యాంటీన్ భ‌వ‌నాన్ని కూల్చేస్తే... తాము ఏం కావాలంటూ దాని నిర్వాహ‌కులు గ‌గ్గోలు పెడుతున్నారు. అయితే వీరి ఆవేద‌న‌ను ఓరకంట కూడా గ‌మ‌నించ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని అధికార యంత్రాంగం త‌మ ప‌ని తాము చేసుకుపోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/