Begin typing your search above and press return to search.

అమెరికా సెనేట్ ఎన్నికల్లో తెలుగులో ప్రచారం చేసిన డెమొక్రాట్లు

By:  Tupaki Desk   |   7 Nov 2019 9:21 AM GMT
అమెరికా సెనేట్ ఎన్నికల్లో తెలుగులో ప్రచారం చేసిన డెమొక్రాట్లు
X
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మీడియం బదులు పూర్తిగా ఆంగ్ల మీడియంను అమల్లోకి తెచ్చేందుకు.. తెలుగును ఇకపై ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంచేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు ఇదే సమయంలో తెలుగు భాషకు మునుపెన్నడూ లేని ప్రాముఖ్యత దక్కింది. అది కూడా అగ్రరాజ్యం అమెరికాలో. అక్కడి డెమొక్రటిక్ పార్టీ సెనేట్ ఎన్నికల ప్రచారం తెలుగు భాషను వినియోగించింది. ఓటర్ల అవగాహన కోసం విడుదల చేసిన నమూనా బ్యాలట్లలో తెలుగు భాషలో ఎన్నికల తేదీని చెబుతూ ఓటేయాల్సిందిగా అభ్యర్థించింది.
'నవంబరు 5వ తేది ఎలక్షన్ రోజు.. దయచేసి మీ వోట్ డెమోక్రటిక్ పార్టీకి వేయండి' అంటూ అందులో అభ్యర్థించారు.

లౌడెన్ కౌంటీలో జరిగిన ఎన్నికల్లో పలు పదవులకు భారతీయులు పోటీ చేశారు. అందులో తెలుగువారూ ఉన్నట్లు సమాచారం. రెండు రోజుల కిందట ఈ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా శాంపిల్ బ్యాలట్లలో అయిదు భాషల్లో ఓటింగ్ తేదీ వంటి వివరాలు ముద్రించారు. ఆ అయిదు భాషల్లో తెలుగు కూడా ఒకటి కావడం విశేషం.

సెనేట్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతూ నమూనా బ్యాలట్లలో అయిదు భాషల్లో రాశారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూతో పాటు మరో రెండు విదేశీ భాషలు అందులో ఉన్నాయి. అమెరికా ఎన్నికల్లో తెలుగు వారి పాత్రను ఇది చాటుతోంది. ఓటర్లుగా కానీ, రాజకీయాల్లో కానీ తెలుగువారి పాత్ర పెరుగుతోందనడానికి ఇది ఉదాహరణ.