Begin typing your search above and press return to search.

డెమి సెక్సువాలిటీ.. ఏంటీ లైంగిక భావన?

By:  Tupaki Desk   |   14 Nov 2021 1:30 AM GMT
డెమి సెక్సువాలిటీ.. ఏంటీ లైంగిక భావన?
X
సెక్సువాలిటీ అనేది ఇప్పుడు నిర్వహించడం చాలా కష్టమైంది. పురుషులు, స్త్రీలు, ట్రాన్స్ జెండర్ల గురించి మనకు తెలుసు. కానీ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది ‘డెమి సెక్సువల్’. 2021 ప్రారంభంలో అప్పటి న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కుమోస్ కుమార్తె మిచెలా కెన్నెడీ కుమో ‘డెమి సెక్సువల్’ను స్వయంగా ప్రకటించడం విశేషం.

కుమోస్ ఇలా ప్రకటించగానే ఆమెను చాలా మంది ఎగతాళి చేశారు. మంచి మానసిక బంధం ఏర్పడిన తర్వాతే డెమి సెక్సువల్ వ్యక్తులకు ఒకరిపై శృంగారపరంగా ఆకర్షణ కలుగుతుంది. అది స్వలింగ, ద్విలింగ సంపర్కులు కావచ్చు. లేదా వాళ్లు ఏ లింగ గుర్తింపునైనా కలిగి ఉండొచ్చు.

ఒకరితో మానసిక బంధం బలపడిన తర్వాతే సెక్సువల్ ఫీలింగ్ కలిగే వ్యక్తులను డెమిసెక్సువల్ గా భావిస్తుంటారు.

డెమీ సెక్సువల్ అంటే లైంగిక ఆసక్తి లేకపోవడం కిందకే వస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటంటే ఒక వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ముందు అతడు/ఆమెతో మానసిక బంధం బలపడే వరకూ డెమిసెక్సువల్ వ్యక్తులు ఎదురుచూస్తుంటారు. అంటే మానసిక బంధం బలపడే వరకు వాళ్లు లైంగిక సంబంధాలకు దూరంగా ఉంటారు. ఆ తర్వాత కూడా లైంగిక ఆకర్షణ ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే పరిమితమై ఉంటుంది. కానీ మిగతావాళ్లకు ఒకరి పట్ల లైంగిక ఆసక్తి కలగడానికి ఈ మానసిక బంధం ఏర్పడటం అనేది అంత ముఖ్యం కాదు.. వాళ్లకు అది పెద్దగా అవసరం ఉండదు.

డెమో సెక్సువాలిటీ లో ధృఢమైన మానసిక బంధం ఏర్పడనంత వరకూ ఒకరిపై మరొకరికి లైంగిక ఆకర్షణ కలగకపోవడం అనేది సహజమేనని చెబుతున్నారు. అలైంగిక వ్యక్తికి మరో వ్యక్తిపై ఎలాంటి లైంగిక ఆకర్షణలు ఉండవని ఈ సంబంధంలో ఉన్న వారు చెబుతున్నారు. ఒక బలమైన మానసిక బంధం ఏర్పడిన తర్వాత లైంగిక సంబంధాలపై ఆసక్తి ఏర్పడుతుందనే విషయం వింటే లైంగిక భావనలు ఉన్న వాళ్లకు పెద్దగా అర్థం కాదని చెబుతున్నారు.