Begin typing your search above and press return to search.
కేటీఆర్ సీఎం.. మళ్లీ డిమాండ్!
By: Tupaki Desk | 16 Aug 2020 3:00 PM GMTమొన్న సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో రెండు వారాల పాటు మౌనంగా ఉండిపోయారు. దీంతో సీఎం కేసీఆర్ ఎక్కడా అని.. ఆయనకు కరోనా సోకిందా అని సోషల్ మీడియాలో, మీడియాలో ప్రతిపక్షాలు హోరెత్తించాయి. కొందరు హైకోర్టుకు కూడా వెళ్లారు.
ఆ సమయంలో కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ అన్నీ తానై వ్యవహరించడం.. ప్రగతి భవన్ లో మంత్రులతో కలిసి మంత్రివర్గ భేటి నిర్వహించడం కలకలం రేపింది. సీఎం కేసీఆర్ లేకుండా మంత్రివర్గ సమావేశం ఏంటని అందరూ ముక్కున వేలేసుకున్నారు. కానీ కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ మంత్రిమండలి సమావేశం జరిగిందని తెలిసింది.
ఈ నెల 12న జరిగిన ఈ భేటిలో మంత్రి కేటీఆర్ ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీలపై మంత్రులకు ప్రజంటేషన్ ఇచ్చారు. 8 గంటల పాటుసాగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పాల్గొన్నారు. కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లో దీన్ని పర్యవేక్షించారు.
అయితే విపక్షాలు దీనిపై మండిపడ్డాయి. కానీ అధికార టీఆర్ఎస్ లో మాత్రం కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అన్న సంకేతాలు ఇచ్చినట్టు అని ప్రచారం సాగింది.
ఈ క్రమంలోనే తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ ను సీఎం చేయాలని ఆయన కోరారు. షకీల్ కామెంట్స్ తో ఇప్పుడు గులాబీ దండులో మళ్లీ కేటీఆర్ ను తెరపైకి తీసుకొస్తున్నారా? సీఎంను చేస్తారా అన్న చర్చ తెరపైకి వచ్చింది.