Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో ఇళ్లా? డిమాండ్ ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 10 April 2023 7:08 PM GMTఇప్పుడు అందరూ పెట్టే పెట్టుబడి ఏంటో తెలుసా? ఇళ్లు.. స్థలాలు.. ఈ రెండింటిపైనే అందరూ డబ్బులు వెచ్చి సుఖమంతమైన జీవితానికి బాటలు వేస్తున్నారు. చేతిలో నాలుగు డబ్బులు ఉన్నప్పుడు నాలుగు ఆస్తులు కొని పెట్టుకోవాలని పెద్దలు ఎప్పుడో చెప్పారు. సినిమాల్లో సంపాదించిన దాంతో నాడు హీరో శోభన్ బాబు నుంచి నేటి మురళీ మోహన్ వరకూ అదే చేశారు. ఇప్పుడు వారి కోట్ల ఆస్తులు వారికి చింత లేకుండా చేస్తాయి. దీర్ఘకాలంగా పెట్టుబడికి సరైనది ‘రియల్ ఎస్టేట్’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా వచ్చిన తర్వాత లాక్ డౌన్ పెట్డడంతో మొదట్లో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు మళ్లీ జోరందుకుంది. ప్రతి నలుగురిలో ముగ్గురు స్థిరాస్తిపైనే లాభసాటి అంటున్నారు.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం యమ జోరుగా సాగుతోంది. మూడు పువ్వులు, ఆరుకాయలుగా అభివృద్ధి చెందుతోంది. నగరంలో ఇప్పుడు ఇళ్లకు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. హైదరాబాద్ లో అయితే సిటీలో ఇతర ప్రాంతాల్లో నివాసమున్న వారు సైతం పిల్లల కోసం ఐటీ కారిడార్ లో స్థిరాస్థులు కొనుగోలు చేస్తున్నాయి. ఇళ్లు ఇక్కడ ఒకింత ఖరీదే అయినా ఆస్తి విలువ సైతం అదే స్థాయిలో పెరుగుతుందని కొనుగోలు చేస్తున్నారని నిర్మాణదారులు చెబుతున్నారు.
మార్కెట్లో అత్యంత సురక్షిత పెట్టుబడి ఏంటంటే అది ‘రియల్ ఎస్టేట్’లో పెట్టుబడులే.. కళ్లముందు ఆస్తి ఉంటుందనే భరోసా ఎక్కువమందికి కలిగి ఇందులో పెడుతున్నారు. హైదరాబాద్ లాంటి చోట మార్కెట్లో ధరలు పెరగడమే తప్ప తగ్గడం ఇప్పటివరకూ ఉండదు. స్వల్పకాలంలోనూ ఒడిదొడుకులు తక్కువే ఉంటాయి. కొనుగోలుదారుల అభిప్రాయమూ ఇదే. ఆర్థిక మందగమనం వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇబ్బందులు తక్కువ అని 82 వాతం మంది ఈ రియల్ ఎస్టేట్ వైపే మొగ్గుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా వృద్ధి చెందుతోంది. నగరంలో రెసిడెన్షియల్ హౌసింగ్ డిమాండ్ జోరుగా సాగుతోంది. మార్చిలో నమోదైన రూ.3352 కోట్ల విలువైన ఇళ్ల కొనుగోలు డీల్స్ ఈ జోష్ కు అద్దం పడుతున్నాయి.
నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం.. హైదరాబాద్ , మేడ్చల్ మల్కజ్ గిరీ, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఇళ్లు, అపార్ట్ మెంట్ల ధరలు ఎంతైనా సరే.. తగ్గేదేల అన్నట్టు కొనుగోలుకు ఎగబడుతున్నారు జనం. ఒక్క మార్చి నెలలో 6414 అపార్ట్ మెంట్లు బుకింగ్స్ జరిగాయంటేనే డిమాండ్ ను అర్థం చేసుకోవచ్చు. క్రితం నెలతో పోల్చి చూస్తే 12శాతం పెరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది.
హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్లు మార్చిలో బలంగా కొనసాగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సీనియర్ డైరెక్టర్ తెలిపారు. ఈ గణాంకాల ప్రకారం.. మార్చి 2023లో నమోదైన మార్చి మొత్తం ఇళ్లలో 53 శాతం ధర రూ.25 లక్షల నుంచి 50 లక్షల మధ్య ఉండగా.. నమోదైన మొత్తం విక్రయాల్లో 70 శాతం 1000 చదరపు అడుగుల నుంచి 2 వేల మధ్య ఉన్న ఇళ్లకు సంబంధించినవి.. రూ.50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లు 29 శాతంగా ఉన్నాయి.
2023లో రూ.25 లక్షల కంటే తక్కువున్న ఇళ్ల డిమాండ్ వాటా 18శాతంగా ఉంది. ఇళ్లకు డిమాండ్ మరింత పెరుగుతోందని.. రూ.1 కోటి, ఆపైన విలువ గల ఇళ్లకు డిమాండ్ బాగా ఉందని నివేదిక పేర్కొంది.
గతఏడాది మార్చిలో 6 శాతంగా ఉన్న డిమాండ్ 2023 నాటికి 10శాతానికి పెరిగింది. మొత్తం విక్రయాలు జరిగిన ఇళ్లలో వీటి షేరు 70 శాతం ఎక్కువ అని నివేదిక పేర్కొన్నారు. హైదరాబాద్ లోని వినియోగదారులు దీర్ఘకాలిక ఆర్థిక పెట్టుబడులపై ప్రయోజనాలపై బలమైన విశ్వాసంతో ఉన్నారని.. నగరంలో ఆఫ్ బీట్ అవుట్ లుక్ ను ప్రతిబింబిస్తుందని అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.