Begin typing your search above and press return to search.
సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు!
By: Tupaki Desk | 24 Oct 2020 4:15 AM GMTకరోనా కష్ట కాలం లోనూ వాహన విక్రయాలు పెరుగుతున్నాయి. ప్రజా రవాణాకంటే సొంత వాహనాల్లో వెళ్లడం మేలని మధ్యతరగతి ప్రజలు భావిస్తున్నారు. దీంతో వాళ్లు కార్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే కొత్త కార్లకంటే సెకండ్ హ్యాండ్ కార్లను కొనేందుకే వాళ్లు ఆసక్తి చూపుతున్నారట. కొత్త కార్ల విక్రయాలు కూడా పెరిగినప్పటికీ, ప్రధానం గా సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాలు పెరిగాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. సెప్టెంబర్ క్వార్టర్ లో మన దేశం లో వాహనాల సేల్స్ పెరిగాయి. సాధారణంగా సెకండ్ హ్యాండ్ కార్లు రూ.50వేల నుండి లభిస్తుంటాయి. కానీ ఇప్పుడు డు డిమాండ్ పెరగడం తో మోడల్ ను బట్టి రూ. లక్ష నుంచి 3 లక్షల వరకు పలుకుతున్నాయట. గతంలో రూ.50వేలు పలికిన కారు, ఇప్పుడు రూ.లక్ష వరకు పలుకుతోందట.
కరోనాతో ఆటోలు, బస్సుల్లో వెళ్లేందుకు చాలామంది భయ పడుతున్నారు. దీంతో కార్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఉపయోగించిన కార్ల వైపు చూస్తున్నారు. కానీ వీటి ధరలు గతంలో కంటే కాస్త పెరిగాయి. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా తేడా లేదు. దీంతో కొనుగోలు దారులు పెట్రోల్ కార్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. బ్రిటన్‌లో సెప్టెంబర్ నెలలో ఉపయోగించిన కారు సేల్స్ 15 శాతం పెరిగాయని ఓ డేటా వెల్లడిస్తోంది. దీంతో కారు ధరలు పెరగడంతో పాటు వడ్డీ రేటు కూడా పెరిగిందట. ఏఏ కార్ డేటా ప్రకారం సెప్టెంబర్ నెల లో యూజ్డ్ కార్ల కోసం బ్రిటన్‌కు చెందిన 48 పట్టణాలు, నగరాల్లో భారీగా పెరిగిందట. జూన్ నెలతో పోలిస్తే సెప్టెంబర్ లో 4 శాతం పెరిగింది. మొత్తానికి కరోనా పుణ్యమా అని సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ పెరిగింది.