Begin typing your search above and press return to search.

అమెరికాలో రాహుల్ ప్ర‌సంగానికి అంత క్రేజట‌

By:  Tupaki Desk   |   12 Sep 2017 5:12 AM GMT
అమెరికాలో రాహుల్ ప్ర‌సంగానికి  అంత క్రేజట‌
X
కాంగ్రెస్‌పార్టీ యువ‌రాజు.. ఆ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తాజాగా అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న తీరుకు భిన్నంగా త‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌ను రివీల్ చేశారు. ఎప్పుడు ఫారిన్ వెళ్లినా గుట్టుచ‌ప్పుడు కాకుండా వెళ్ల‌టం.. తిరిగిరావ‌టం రాహుల్ కు ఒక అల‌వాటు.

ఈ మ‌ధ్య‌న ఆ తీరుకు భిన్నంగా తాను వెళుతున్న ఫారిన్ టూర్ల గురించి చెబుతున్నారు. తాజాగా రెండు వారాల ట్రిప్ కోసం అమెరికాలో ల్యాండ్ అయ్యారు రాహుల్ తో పాటు మ‌రికొంద‌రు కాంగ్రెస్ నేత‌లు ఆయ‌న వెంట ఉన్నారు. ఇంత‌కీ తాజా యూఎస్ ట్రిప్ ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. అమెరికాలోని ప‌లు విశ్వ‌విద్యాల‌యాల్లో నిర్వ‌హించే ప్ర‌సంగ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

ప్ర‌పంచ మేధావులు.. రాజ‌కీయ వేత్త‌లు.. భార‌త అమెరిక‌న్లు రాహుల్ స‌భ‌ల‌కు హాజ‌రు కానున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే కాలిఫోర్నియా వ‌ర్సిటీలో 70 ఏళ్ల స్వ‌తంత్ర భార‌తావ‌ని పై ప్ర‌సంగించ‌నున్నారు. అయితే.. రాహుల్ స్పీచ్ వినేందుకు అసాధార‌ణ స్థాయిలో రెస్పాన్స్ వ‌చ్చింద‌ని చెబుతున్నారు. దీంతో.. పేర్ల న‌మోదు కార్య‌క్ర‌మాన్ని నిలిపివేసిన‌ట్లుగా విశ్వ‌విద్యాల‌యం ప్ర‌క‌టించింది. రాహుల్ ప్ర‌సంగం కోసం ఇంత భారీ ఎత్తున డిమాండ్ వెల్లువెత్త‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.