Begin typing your search above and press return to search.

మద్యం డోర్ డెలివరీకి అనుమతి డిమాండ్ !

By:  Tupaki Desk   |   11 May 2021 12:44 PM GMT
మద్యం డోర్ డెలివరీకి అనుమతి డిమాండ్ !
X
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌ డౌన్ ప్రకటించింది. ఉదయం 6గంటల నుండి 10గంటల వరకూ అన్నీ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయి అని, ఆ తర్వాత మొత్తం మూసేయాల్సిందే అని అన్నారు. లాక్ డౌన్ అని న్యూస్ బయటకి వచ్చిందో లేదో అప్పుడే వైన్స్ ముందు భారీ క్యూలు వెలిశాయి. లాక్ డౌన్ సమయంలో వైన్ షాపులపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో మందుబాబులు బారులు తీరుతూ మద్యం షాపుల ముందు తంటాలు పడ్డారు. లాక్‌ డౌన్ ప్రకటనతో తెలంగాణలో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల దగ్గర మందుబాబులు ఎగబడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైన్స్ షాపుల దగ్గర భారీగా క్యూ కనిపిస్తోంది.

మద్యం షాపుల దగ్గర భౌతికదూరం గాలికొదిలేశారు. మద్యం దుకాణాల వద్ద కరోనా నిబంధనలు అసలు పాటించడం లేదు. అయితే మద్యం డోర్ డెలివరీకి అనుమతి ఇవ్వాలని డిస్టిలరీ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అయితే , మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైన్ షాపులు కూడా ఓపెన్ చేస్తామని చెప్పింది. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకూ అన్నీ దుకాణాలు తెరిచిన సమయంలోనే వైన్ షాపులు కూడా ఓపెన్ చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు అబ్కారీ శాఖకు ప్రాథమికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అబ్కారీ కార్యాలయాలు కూడా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఉంటాయని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఏపీలో కూడా ఉదయమే మద్యం దుకాణాలను తెరుస్తున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్ డౌన్ ఖరారైంది. అయితే లాక్ డౌన్ లో నిత్యావసరాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాలతో ఆదాయం తగ్గకుండా ఈ చర్యలు చేపట్టింది.