Begin typing your search above and press return to search.
వామ్మో..లిక్కర్ షాపుల కోసం ఇంత డిమాండా?
By: Tupaki Desk | 22 Sep 2015 6:56 AM GMTతెలంగాణ రాష్ట్రంలోని మద్యం దుకాణాలకు దరఖాస్తులు దాఖలు చేసే విషయంలో భారీ పోటీ నెలకొంది. ఉద్యోగాల కోసం ఏ రేంజ్ లో అయితే పోటీ పడుతున్నారో.. మద్యం దుకాణాల కోసం అంతే భారీగా దరఖాస్తులు పెట్టుకుంటున్నారు.
ఆడ.. మగ అన్న తేడా లేకుండా అందరూ మద్యం దుకాణాలకు దరఖాస్తులు దాఖలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2,093 మద్యం షాపులకు ఇప్పటివరకు సుమారు 26వేల వరకు దరఖాస్తులు చేసుకున్నట్లు చెబుతున్నారు. అంటే.. సరాసరిన ఒక షాపు కోసం కాస్త అటూఇటూగా పది మంది పోటీ పడుతున్న పరిస్థితి.
షాపుల కోసం దరఖాస్తులు దాఖలు చేసిన దాని నుంచే దాదాపు రూ.100కోట్ల ఆధాయం వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలంగాణలోని మద్యం దుకాణాల లైసెన్స్ ల కోసం తెలంగాణ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ నెలకొని ఉంటే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాకపోవటం గమనార్హం.
అదే సమయంలో గ్రేటర్ శివారులో మాత్రం దరఖాస్తులు పోటాపోటీగా పెట్టుకుంటున్న పరిస్థితి. ఇక.. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో పురుషులే కాదు.. మహిళలు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు దాఖలు చేయటం కనిపిస్తోంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తెలంగాణ సరిహద్దు జిల్లాలు అయిన ఖమ్మం.. నల్గొండ లో మద్యం దుకాణాల కోసం.. ఏపీకి చెందిన పలు జిల్లాల వారు దరఖాస్తులు చేసుకోవటం కనిపించింది. దరఖాస్తు చేసుకున్న మద్యం దుకాణాలకు సంబంధించి లక్కీడీప్ ద్వారా నిర్ణయించనున్నారు. మరి... ఎవరా అదృష్టవంతు లో చూడాలి.