Begin typing your search above and press return to search.

అమెరికా వీసా స్లాట్‌లు అమ్ముకుంటున్నారా?

By:  Tupaki Desk   |   22 March 2023 11:00 PM GMT
అమెరికా వీసా స్లాట్‌లు అమ్ముకుంటున్నారా?
X
భారత్ లో అమెరికా వీసా స్లాట్ లు అమ్ముకుంటున్నారా? డిమాండ్ దృష్ట్యా భారీ రేట్లకు  ఇవి అమ్మి సొమ్ము చేసుకుటున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. కరోనా రాకతో 2000 నుంచి అమెరికా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో స్లాట్ లు పెరిగిపోయాయి. దాదాపు ఏడాది పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

2000 చివరి నుంచి వీసా స్లాట్ సమయం పెరిగింది. కొన్ని భారతీయ కంపెనీలు విద్యార్థులకు , బహుళ వీసా దరఖాస్తుదారులకు వీసా స్లాట్‌లను విక్రయించడం ద్వారా  సొమ్ము చేసుకున్నాయనే ఆరోపణలున్నాయి.  ఇలా కంపెనీలు సంపాదించడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాయి. ప్రస్తుతం $100 డాలర్ల నుంచి నుండి $1000 డాలర్ల వరకూ అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది..

మహమ్మారి కారణంగా స్లాట్‌ల కొరత ఉందని, మరోవైపు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో భాగంగా అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్యను పెంచాలని అమెరికా కాన్సులేట్ భావిస్తోంది. వాస్తవానికి  ఎఫ్1 వీసా (ఫ్రెషర్స్ , తిరస్కరించినవి ) స్లాట్‌ల కోసం విద్యార్థులకు ఆఫర్లు ఇస్తున్నారు. కొన్ని కంపెనీలు ఇలా స్లాట్ లను విద్యార్థులకు ఆఫర్ ఇస్తున్నారు. ఇందులో ఫేస్ బుక్ లాంటి కంపెనీలు కూడా ఉన్నాయని అంటున్నారు.
 
సాధారణంగా ఈ కార్యాలయాలు తమకు ముందస్తు వీసా అపాయింట్‌మెంట్ లభిస్తాయని క్లెయిమ్ చేస్తాయి. బహుళ అమెరికా కాన్సులేట్‌లలోని కాన్సులర్ అధికారులతో  మునుపటి తేదీల కోసం కొంతమంది స్టాట్ లను అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. ట్రావెల్ ఏజెంట్లకు ప్రత్యేక అధికారాలు లేవని కూడా అలాంటి కంపెనీలు పంచుకుంటాయి.

అమెరికా కాన్సులర్ కార్యాలయాలు ఇటువంటి పద్ధతులు తమ స్వంత ప్రక్రియలను ప్రభావితం చేస్తాయని చెబుతున్నప్పటికీ.. సమస్యను పరిష్కరించడానికి ఇప్పటివరకు చాలా తక్కువ చర్యలు తీసుకున్నాయి.

 నైజీరియాలో ఇదే విధమైన స్టాట్ ల అమ్ముతున్నారనే పరిస్థితి ఉంది. కాన్సులేట్‌లు సమస్యను 'గుర్తిస్తున్నప్పుడు' వారు ఇప్పుడు నెమ్మదిగా తమ చర్యను సరిదిద్దడానికి పని చేస్తున్నారు. విద్యార్థులు వీసాల కోసం రాబోయే రోజుల్లో కాన్సులేట్ సిబ్బందిని సంప్రదించేలా చూసుకుంటున్నారు.            


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.