Begin typing your search above and press return to search.

క‌రోనా వేళ బ‌ర్త్ డే వైర‌ల్‌: ‌భావోద్వేగానికి లోనైన డెలీవ‌రి బాయ్‌

By:  Tupaki Desk   |   1 May 2020 11:30 PM GMT
క‌రోనా వేళ బ‌ర్త్ డే వైర‌ల్‌: ‌భావోద్వేగానికి లోనైన డెలీవ‌రి బాయ్‌
X
క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో అత్యావ‌స‌ర సేవ‌లు కొన‌సాగుతున్నాయి. పోలీసులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, విద్యుత్‌, తాగునీటి విభాగా‌లు ప‌ని చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ డెలివ‌రీ బాయ్‌లు కూడా కీల‌కంగా ప‌ని చేస్తున్నారు. కూర‌గాయ‌లు, కిరాణ స‌రుకులు ఇంటింటికి చేర‌వేస్తున్నారు. అయితే ఇది భార‌త‌దేశంలో త‌క్కువ‌గా ఉండ‌గా విదేశాల్లో అత్య‌ధిక సంఖ్య‌లో డెల‌వ‌రీ బాయ్‌లు సేవ‌లు అందిస్తున్నారు. అయితే చైనాలో లాక్‌డౌన్ కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే ఓ డెలివ‌రీ బాయ్ బ‌ర్త్ డే వ‌చ్చింది. అయితే అత‌డి పుట్టిన రోజు విష‌యాన్ని గుర్తించిన ఓ క‌స్ట‌మ‌ర్ అత‌డికి కేక్ పంపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. దీంతో ఆ డెలివ‌రీ బాయ్ కేక్‌ను తీసుకుని భావోద్వేగంతో క‌న్నీటిపర్యంత‌మ‌య్యాడు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల‌వుతోంది.

చైనాలో నిత్యావ‌సర స‌రుకులు, ఆహారాన్ని డెలివ‌రీ బాయ్స్ అందిస్తున్నారు. చైనాలోని క‌రోనా వైర‌స్ వెలుగుచూసిన వూహాన్ న‌గ‌రంలో కూడా డెలివ‌రీ బాయ్స్ ప‌ని చేస్తున్నారు. ఈ క్ర‌మంలో విధులు నిర్వ‌హిస్తున్న ఓ బాయ్‌కు వింత అనుభ‌వం ఎదురైంది. ఎప్ప‌టిలాగే ఏప్రిల్ 15వ తేదీన త‌న ఆర్డ‌ర్ల‌ను డెలివ‌రీ చేయ‌డానికి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో ఆర్డ‌ర్ వ‌చ్చిన బేక‌రికి వెళ్లాడు. అక్క‌డ కేక్ తీసుకుని ప‌రిశీలించ‌గా అత‌డి పేరు ఉంది. బేక‌రీలోని వ్య‌క్తి అది నీ కోస‌మే వ‌చ్చింద‌ని తెలిపాడు

మొద‌ట ఆ యువ‌కుడు న‌మ్మ‌లేదు. అయోమ‌యానికి లోనై రెండుసార్లు త‌న‌కు కాద‌ని చెప్పినా ఆ వ్య‌క్తి లేదు.. నీకే అని చెప్ప‌డంతో తీసుకున్నాడు. తీసుకుని ప‌రిశీలించ‌గా హ్యాపీ బ‌ర్త్ డే అంటూ అత‌డికి విష్ చేస్తూ కేక్ ఉంది. దీంతో ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యాడు. తీరా అప్పుడు గుర్తొచ్చొంది.. త‌న బ‌ర్త్ డే అని. ఆ వెంట‌నే ఉబ్బిత‌బ్బిబై భావోద్వేగానికి గుర‌య్యాడు. ఈ క్ర‌మంలో బోరున విల‌పించాడు. వ‌స్తున్న క‌న్నీళ్ల‌ను తుడుచుకుంటూ కేక్ తిన్నాడు. దీనికి సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.