Begin typing your search above and press return to search.

స్విగ్గీ డెలివరీ ఆడి కారులో.. అదే అతగాడి స్పెషల్

By:  Tupaki Desk   |   12 Jun 2021 2:30 PM GMT
స్విగ్గీ డెలివరీ ఆడి కారులో.. అదే అతగాడి స్పెషల్
X
ఇప్పుడున్న కాలంలో రోటీన్ కు భిన్నంగా వ్యవహరించటం ఒక అలవాటుగా మారింది. దాన్నే ఆయుధంగా చేసుకొని కొందరు డబ్బును..ఫేమ్ ను సొంతం చేసుకుంటున్నారు. ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చిన కాసేపటికి వేడి వేడి ఫుడ్ డెలివరీ చేసే స్విగ్గీ.. జొమాటో.. ఇలానే చాలా సంస్థల డెలివరీ బాయ్స్ ను చూస్తూనే ఉంటాం. కానీ.. ఇప్పుడు చెప్పే బాయ్ అందుకు భిన్నం. ఈ డెలివరీ బాయ్ బైక్ మీద రాడు. ఖరీదైన ఆడి ఆర్8 కారులో వచ్చి మరీ ఫుడ్ డెలివరీ చేసి వెళతాడు. తన వివరాల్ని వెల్లడించని ఇతడు.. ఆడి కారులో ఫుడ్ డెలివరీ చేసిన వైనాన్ని వీడియో చేసి.. దాన్ని అప్ లోడ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హాట్ టాపిక్ అయ్యింది.

గతంలో తాను హెచ్2 సూపర్ బైక్ మీద ఫుడ్ డెలివరీ చేసేవాడినని.. అయితే.. ఆడి కారు వాడొచ్చు కదా? అని కొందరు అడగటంతో తాను ఆడి కారులో ఫుడ్ డెలివరీ చేసినట్లు చెప్పాడు. తనతో పాటు మరో వ్యక్తిని కూడా స్విగ్గీ డ్రెస్ లో కూర్చోబెట్టుకొని ఉండటం గమనార్హం. చూస్తుంటే.. తనకు సహాయకుడిగా ఆడి కారు యజమాని పెట్టుకొని ఉండొచ్చని భావిస్తున్నారు.

ఆడి కారులో ఫుడ్ డెలివరీ చేయటం ఏమీ ఫ్రాంక్ వీడియో కాదు. రియల్.. అంటే రియల్. మరి.. ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు? అన్న క్వశ్చన్ రావొచ్చు. జెడ్ జనరేషన్ లో ఉన్న వారంతా మిగిలిన వారికంటే భిన్నమైన పనులు చేయటానికి ఎక్కువ ఇష్టపడతారు. ఈ క్రమంలోనే ఇలా చేసి ఉండొచ్చు. తాను డెలివరీ చేసిన తీరును వీడియోగా మలిచి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయటంతో ఇప్పుడు పేరుకు పేరు.. డబ్బులకు డబ్బులు రావటం గమనార్హం.

ఆడి కారులో డెలివరీ కోసం యాప్ ఓపెన్ చేసిన గంట తర్వాత మొదటి ఆర్డర్ వచ్చిందని చెప్పాడు. తానే స్వయంగా ఫుడ్ ఆర్డర్ ను ఓకే చేసి.. వారు ఆర్డర్ చేసిన బేకరీకి వెళ్లి వారు ఆర్డర్ చేసిన ఫుడ్ ను తీసుకున్నారు. అనంతరం వారు చెప్పిన లొకేషన్ కు వెళ్లటానికి మాత్రం కష్టమైందని చెబుతున్నాడు. ఎందుకంటే..ఆర్డర్ చేసిన ఇంటి పరిసర ప్రాంతాల రోడ్డు ఇరుకుగా ఉండటంతో కారును ఒక చోట నిలిపి.. నడుచుకుంటూ వెళ్లి డెలివరీ చేసి వచ్చారు.

ట్రాఫిక్ కారణంగా రెండు డెలివరీలు మాత్రమే ఇచ్చినట్లు చెప్పాడా వ్యక్తి. బైక్ తో పోలిస్తే.. కారులో డెలివరీ చేయటం కష్టంగా ఉందన్న అతడు..ఆడి కారులో డ్రైవింగ్ చాలా సౌకర్యవంతంగా ఉన్నట్లు చెప్పాడు. ఏమైనా.. ఆడి కారులో ఫుడ్ డెలివరీ చేసిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.