Begin typing your search above and press return to search.
మా నాన్నే.. సెక్సువల్‌గా హ్యరాష్ చేశాడు: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 12 March 2023 9:00 AM GMTకన్న బిడ్డ పట్ల ఏ తండ్రి అయినా.. ప్రేమతో ఉంటాడు. ఆబిడ్డ బాగోగులు.. చదువు, పెళ్లి.. కోసం.. తపించిపోతాడు. అనుక్షణం తన కష్టం అంతా ధారపోస్తాడు. అయితే.. ఇటీవల కాలంలో దేశంలో కుమార్తెలపై తండ్రులు దాడులకు పాల్పడడం.. వారిని లైంగికం గా వేధించడం వంటివి వెలుగు చూస్తున్నాయి.అ యితే.. ఎక్కడో రేర్‌గానే జరుగుతున్నాయి. అయినా..సమాజం వారిని స్వాగతించడం లేదు..ఏవగించుకుంటోంది. తాజాగా తన తండ్రి తనను సెక్సువల్‌గా హ్యారాష్ చేసేవాడని.. సాక్షాత్తూ.. దేశ రాజధాని ఢిల్లీలో మహిళలకు రక్షణ కల్పించే మహిళా కమిషనర్ చైర్ పర్సన్ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
తన చిన్నతనంలో తండ్రి తనను లైంగిక వేధింపులకు గురి చేసేవాడని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మాలివాల్ వెల్లడించారు. చిన్నతనంలోనే తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని తెలిపారు. "మా నాన్న తరచూ నన్ను లైంగికంగా వేధించేవాడు. ఆయన ఇంట్లోకి వస్తేనే నేను భయపడేవాడిని. నాకు ఇంకా గుర్తు.. ఆయనకు భయపడుతూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అలాంటి వాళ్లకు నేను ఏం చేయాలో అప్పుడే ఆలోచించాను`` అని మాలివాల్ అన్నారు.
ఏ కారణం లేకుండానే తనను తన తండ్రి హింసించేవాడని, ఒకసారి తన జుట్టు పట్టుకుని గోడకు కొట్టాడని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ``మా అమ్మ, అత్తమామలు, తాతయ్య లేకుంటే నేను ఇలా ఉండేదానిని కాదు. ఎవరినైనా హింసించినప్పుడు.. ఆ వ్యక్తిలో అగ్ని వెలుగుతోంది. దానిని సరైన మార్గంలో పెడితే ఏదైనా సాధించగలరు`` అని మాలివాల్ తెలిపారు.
ఇదిలావుంటే, జపాన్కు చెందిన యువతిపై హోలీ సందర్భంగా రంగులు పూసి అనుచితంగా వ్యవహరించిన ఘటనపైనా స్పందించారు. " ఇంటర్నెట్లో వైరల్ అయిన జపాన్ మహిళ వీడియోను చూశాను. ఆమె చాలా వేధింపులకు గురైంది. సహాయం కోసం అడిగింది. అయినా వారు ఆపలేదు. దీనిపై ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేస్తున్నాం. నిందితులను గుర్తించి జైలులో పెట్టాలి" అని ఆమె చెప్పారు. కాగా, మాలివాల్ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.