Begin typing your search above and press return to search.

ఆటో డ్రైవర్ని రేప్ చేయబోయిన మహిళ

By:  Tupaki Desk   |   17 July 2015 10:04 AM IST
ఆటో డ్రైవర్ని రేప్ చేయబోయిన మహిళ
X
మీరేమీ తప్పు చదవలేదు. నిజమే.. సీన్ రివర్స్ అయ్యింది. ఆటోలో ప్రయాణించే మహిళలు అప్పుడప్పడు అత్యాచారానికి గురి కావటం.. బాధితులు పోలీసుల్ని ఆశ్రయించటం లాంటివి మామూలే. కానీ.. అందుకు భిన్నమైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఒక ఆటో డ్రైవర్ని.. ఒక మహిళ అత్యాచార యత్నం చేయటం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే.. ఢిల్లీలోని సాకేత్ నుంచి అర్జున్ నగర్ లోని తన నివాసానికి ఒక మహిళ ఆటోను మాట్లాడుకుంది. గమ్యస్థానం చేరిన తర్వాత.. డబ్బుల కోసం తన ఫ్లాట్ కు రావాల్సిందిగా కోరటతో ఆటో డ్రైవర్ సరేనని వెళ్లాడు.

ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్ని పిలిచిన సదరు మహిళ తలుపు వేసి.. మద్యం అందించటం.. అత్యాచార యత్నం చేయటం జరిగింది. దీంతో లబోదిబో అన్న డ్రైవర్ ను పట్టించుకోకుండా ఆటో డ్రైవర్ డ్రెస్ ను చించివేసింది. అదే సమయంలో మరో మహిళ వచ్చి.. జరుగుతున్న తంతును కెమేరాతో షూట్ చేయటం మొదలు పెట్టింది.

డ్రైవర్ దగ్గరి పర్సును.. ఫోన్ ని లాక్కున్నారు. ఇలా.. ఒకటి తర్వాత ఒకటిగా సాగుతున్న షాకింగ్ పరిణామాలతో బిత్తరపోయిన ఆటో డ్రైవర్ ఆ ఇంటి నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఇంటి బాల్కనీ లో నుంచి దూకిన ఆటో డ్రైవర్ రెండు కాళ్లు విరిగిన పరిస్థితి. అనంతరం పోలీసులను ఆశ్రయించిన ఆటో డ్రైవర్ ఫిర్యాదుతో.. సదరు ప్లాట్ లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తే.. మరికొన్ని ఆటో డ్రైవర్ల బ్యాడ్జీలు.. లైసెన్స్ లు దొరకటం గమనార్హం. ఈ ఉదంతంలో ఒక మహిళను అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ట్రాప్ చేసి.. ఆటో డ్రైవర్లను సదరు యువతులు ఆడుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.