Begin typing your search above and press return to search.

‘ప్రభు’ బాటలో ఢిల్లీ రాష్ట్రమంత్రి

By:  Tupaki Desk   |   24 April 2016 4:37 AM GMT
‘ప్రభు’ బాటలో ఢిల్లీ రాష్ట్రమంత్రి
X
సోషల్ మీడియాను ప్రజాసమస్యల పరిష్కారానికి ఎలా వినియోగించుకోవచ్చన్నది కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు అందరికి అర్థమయ్యేలా చేశారని చెప్పాలి. ఇవాల్టి రోజున దేశంలో ఏ ట్రైన్లో ప్రయాణిస్తున్నా.. తమకు ఏదైనా సమస్య ఎదురైతే వాళ్లని.. వీళ్లని సంప్రదించటం మానేసి ఏకంగా కేంద్రమంత్రి దృష్టికి ఇష్యూను తీసుకెళ్లటం తెలిసిందే. ప్రయాణికుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేంద్రమంత్రి సురేశ్ ప్రభు అనుసరిస్తున్న వైఖరికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. తాను ఎక్కడున్నా సరే.. రైల్వేలకు సంబంధించిన తమ ట్విట్టర్ ఖాతాలో నమోదైన సమస్యపై తక్షణం స్పందించటం.. ప్రయాణికుల సమస్యల్ని పరిష్కరించటంలో రైల్వేశాఖను మించింది మరొకటి లేదన్న ప్రశంసల్ని మూటకట్టుకున్నారని చెప్పాలి.

తాజాగా రైల్వే మంత్రి బాటలోనే పయనించిన ఢిల్లీ రాష్ట్రమంత్రి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. దేజుల్లో శ రాజధాని ఢిల్లీకి చెందిన ఒక ఇంటికి నీటిబిల్లు వచ్చింది. ఆ బిల్లులో మొత్తాన్ని చూసిన ఆ ఫ్యామిలీకి గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే.. బిల్లు ఏకంగా రూ.58,042 రావటమే దీనికి కారణం. తమకొచ్చిన నీటి బిల్లును చూసుకున్న లెహర్ సేథీ అనే మహిళ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. నీటిపారుదల శాఖామంత్రి కపిల్ మిశ్రా కు తాను ఎదుర్కొంటున్న సమస్యను ప్రస్తావిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ సమస్యను రెండు రోజుల్లో తీరుస్తానన్న మంత్రి కపిల్ మిశ్రా.. చెప్పినట్లే రెండు రోజులకే భారీగా వచ్చిన బిల్లు లెక్క తేల్చేశారు. ఒక్క ట్వీట్ తో తమ సమస్య తీరిపోవటంపై ఢిల్లీ సర్కారుపై ప్రశంసలు కురిపిస్తున్నారు లెహర్ ఫ్యామిలీ. దేశ వ్యాప్తంగా ఉన్న మంత్రులు.. కీలక నేతలు కేంద్రమంత్రి సురేశ్ ప్రభు బాట పడితే బాగుంటుంది.