Begin typing your search above and press return to search.
ఢిల్లీ అల్లర్లు: 34కు చేరిన మృతులు.. మరింత పెరిగే అవకాశం
By: Tupaki Desk | 27 Feb 2020 7:50 AM GMTదేశ రాజధాని ఢిల్లీ ఘర్షణలతో అట్టుడుకుతోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. సమర్థిస్తూ ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 34కు చేరింది. చాలా మంది గాయపడ్డారని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
24,25వ తేదీల్లో జరిగిన ఘర్షణల్లో గాయపడి చికిత్స పొందుతున్న ఏడుగురు గురువారం మరణించారు. ఈ హింసాకాండలో 250మందికి పైగా గాయపడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్రం రంగంలోకి దిగి జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ను రంగంలోకి దించింది.
కాగా ఈ హింసాత్మక ఘటనలో యువ ఇంటెలిజెన్స్ అధికారి అంకిత్ శర్మ మురుగుకాలువలో శవమై తేలడం విషాదం నింపింది. ఈ ఘర్షణల్లో 183మందికి బుల్లెట్ గాయాలు, కత్తులు, ఇతర ప్రాణాంతక ఆయుధాల దాడుల వల్ల తీవ్రగాయాలైనట్టు వైద్యులు గుర్తించారు.దుండగులు తరమడంతో చాలా మంది తప్పించుకోవడానికి ఇళ్లపై అంతస్థుల నుంచి దూకడం వల్లే ఎక్కువ గాయాలైనట్టు వైద్యులు తెలిపారు.