Begin typing your search above and press return to search.

దించక్ పూజా.. చిక్కుల్లో పడింది

By:  Tupaki Desk   |   30 Jun 2017 4:58 AM GMT
దించక్ పూజా.. చిక్కుల్లో పడింది
X
దించక్ పూజా.. ఈ పేరు చెబితే నెటిజన్లు ఉలిక్కి పడుతుంటారు. కర్ణ కఠోరమైన తన వాయిస్ తో జనాల మతులు పోగొట్టేసింది ఈ అమ్మాయి. ‘దించక్ పూజా’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి తనేదో పెద్ద పాప్ స్టార్ అన్నట్లుగా గొంతు చించుకుని పాటలు పాడటం.. చిత్ర విచిత్రమైన హావభావాలు ఇవ్వడం.. తన పాట విన్న వాళ్లకు చిత్రాతి చిత్రమైన అనుభూతి కలిగించడం ఈ అమ్మాయికి అలవాటు.

ముందు ఏదో సరదాకి.. జనాల దృష్టిని ఆకర్షించడానికి ఆ అమ్మాయి ఇలా చేస్తోందనుకున్నారు కానీ.. తనేదో సీరియస్ సింగర్ అన్నట్లుగా ఆమె ఇచ్చే బిల్డప్పులు చూసి జనాలకు చిర్రెత్తుకొచ్చింది. ఐతే ఇప్పుడందరూ నెగెటివ్ పబ్లిసిటీతోనే వార్తల్లో నిలుస్తున్నారు కాబట్టి పూజా కూడా ఆ మార్గాన్నే ఎంచుకుంది. ఐతే అమ్మడి అల్లరి వేషాలు శ్రుతి మించిపోవడంతో ఇప్పుడు అనవసర చిక్కుల్లో పడింది.

దించక్ పూజా ఇటీవలే రెడ్ డ్రెస్ వేసుకుని.. రెడ్ కలర్ స్కూటీ మీద చక్కర్లు కొడుతూ ఒక పాట అందుకుంది. దాన్ని వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్లో అప్ లోడ్ చేసింది. ఈ పాటే ఇప్పుడామెను చిక్కుల్లోకి నెట్టింది. ఈ పాట చిత్రీకరణ సందర్భంగా పూజా హెల్మెట్ పెట్టుకోలేదు. అలాగే పబ్లిక్ లో తన పాటలతో న్యూసెన్స్ క్రియేట్ చేసింది. ఇది చూసి ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి పూజాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఢిల్లీలో హెల్మెట్ తప్పనిసరి. పూజా హెల్మెట్ లేకుండా బండి నడిపిందని.. అలాగే న్యూసెన్స్ క్రియేట్ చేసిందని ఆ వ్యక్తి ఆమెపై ఫిర్యాదు చేశాడు. దీంతో పూజాపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/