Begin typing your search above and press return to search.
టీడీపీ ఎమ్మెల్సీలకు ఢిల్లీ టూర్ రద్దు.. ఝలక్ తగిలిందా!
By: Tupaki Desk | 18 Feb 2020 11:00 AM ISTశాసనమండలి రద్దు అంశాన్ని ఢిల్లీ స్థాయిలో రచ్చ చేయాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడో పథకం రచించుకుంది. మండలి రద్దు సీఎం అనుకోగానే అయిపోదని, శాసన సభ తీర్మానం చేయగానే మండలి రద్దు కాదంటూ తెలుగుదేశం పార్టీ వాళ్లు వాదించారు. ఈ విషయంలో తమ పోరాటం కొనసాగుతుందంటూ తెలుగుదేశం ఎమ్మెల్సీలు ప్రకటించారు. ఈ విషయంలో తాము ఢిల్లీకి వెళ్తామంటూ ప్రకటించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిసే ప్రణాళికను కూడా పెట్టుకున్నారు తెలుగుదేశం ఎమ్మెల్సీలు. వారిని కలిసి మండలి రద్దు వద్దని, ఏపీ ప్రభుత్వం చేసిన ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించకూడదని కోరనున్నట్టుగా ప్రకటించారు. ఆ మేరకు వారి ఢిల్లీ టూర్ ఏర్పాట్లు కూడా జరిగాయి.
అలా చేసి జగన్ నిర్ణయంపై ఒత్తిడి పెంచుతామని వారు ప్రకటించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ టూర్ రద్దు అయ్యిందట. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం.. ఈ మంగళవారం రోజునే వారు ఢిల్లీ వెళ్లాల్సిందట. మంగళవారం ఢిల్లీ వెళ్లి అక్కడ మోడీ, అమిత్ షాలను కలిసి వారికి మండలి రద్దుపై ఫిర్యాదు చేయాలని అనుకున్నారట. ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ లో, పార్లమెంట్ లో ఆమోదించకూడదని.. వారు కోరాలని భావించారు.
అయితే మంగళవారం తెలుగుదేశం ఎమ్మెల్సీల ఢిల్లీ ప్రయాణం జరగలేదు. దీంతో ఈ పర్యటన రద్దు అయినట్టుగా తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం.. ఢిల్లీలో అపాయింట్ మెంట్లు లభించకపోవడమే అని సమాచారం. ప్రస్తుతం మోడీ, అమిత్ షాలను కలవడం అంటే మాటలు కాదు. బీజేపీ నేతలకు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా అంత తేలిక వ్యవహారం కాదు అది. అలాంటిది తెలుగుదేశం ఎమ్మెల్సీలు, తమ పదవులు పోతున్నాయంటూ.. తమ పదవులను నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలకు ఢిల్లీ లో అపాయింట్ మెంట్ లు లభించడం అంత తేలికేమీ కాదు. ఈ నేపథ్యంలో వారికి అలా ఝలక్ తగిలినట్టుగా ఉంది.
ఈ పర్యటన రద్దుతో మండలి రద్దు గురించి ఢిల్లీలో హల్చల్ చేసే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ కోల్పోయినట్టే. మరో వైపు మండలి రద్దు ఫైల్ ముందుకు కదులుతూ ఉందని, త్వరలోనే కేంద్ర కేబినెట్ లో అది ఆమోదం పొందుతుందని, ఆపై అది పార్లమెంట్ లో కూడా ఆమోదం పొందనుందని వార్తలు వస్తూ ఉన్నాయి.