Begin typing your search above and press return to search.

చిన్నారులు రోడ్లపైకి.. ఆ జాబితాలో ఢిల్లీ టాప్

By:  Tupaki Desk   |   28 Dec 2021 1:30 AM GMT
చిన్నారులు రోడ్లపైకి.. ఆ జాబితాలో ఢిల్లీ టాప్
X
దేశంలో మానవతా విలువలు రోజురోజుకూ పడిపోతున్నాయి. పొత్తిళ్లలో చిన్నారి కళ్ళు తెరిచీ తెరవకముందే ఆ పసికందును దూరం చేసుకుంటున్న కన్నతల్లి.  వారు చేసిన తప్పులకు శిక్ష ఆ పసికందులకు వేస్తున్నారు కొంతమంది తల్లులు. ఇలాంటి ఘటన దేశవ్యాప్తంగా చాలా వెలుగు చూస్తున్నాయి. ఆవేశం ఆపుకోలేని అమ్మానాన్నలు చేసే తప్పుకు చిన్నారులు బలి అవుతున్నారు. అంతేకాకుండా లింగ వివక్షత తో మరికొంతమంది పసికందులు రోడ్లపై కానీ చెత్తకుప్పల్లో కానీ దర్శనమిస్తున్నారు.

ఇలా రోడ్డుపై లేదా చెత్త కుప్పల్లో చిన్నారులు దొరికే ఘటనలపై జాతీయ నేర పరిశోధన సంస్థ అధ్యయనం చేపట్టింది. అయితే దీనిలో ఎన్నో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.  2015 నుంచి 2020 వరకు జరిగిన ఈ అధ్యయనంలో దేశ వ్యాప్తంగా సుమారు 6 వేలకు పైగా మంది చిన్నారులు ఢిల్లీ రోడ్లపై దర్శనం ఇచ్చినట్లు జాతీయ నేర పరిశోధన సంస్థ తెలిపింది.

పుట్టిన చిన్నారులను రోడ్డుపై వదిలివేయడం లాంటి అమానవీయ ఘటనలపై అధ్యయనం చేపట్టిన జాతీయ నేర పరిశోధన సంస్థ... ఈ జాబితాలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఈ ఐదు సంవత్సరాల కాలంలో సుమారు 200 పైగా మంది చిన్నారులను ఢిల్లీ వీధుల్లో కన్న తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళినట్టుగా తేలింది. అయితే ఇలాంటి ఘటనలు కేవలం ఢిల్లీలో మాత్రమే కాకుండా దేశంలోని వివిధ నగరాల్లో కూడా ఎక్కువగానే జరిగాయి. మొదటి స్థానంలో ఢిల్లీ ఉండగా రెండో స్థానంలో సిలికాన్ సిటీ బెంగళూరు ఉంది.

మన దేశానికి ఆర్థిక రాజధాని అయినా ముంబై మాత్రం మూడో ప్లేస్ పెట్టుకున్నట్లు జాతీయ నేర పరిశోధన సంస్థ వెల్లడించిన అధ్యయన వివరాలను తేలింది. వీటితో పాటు నాలుగు ఐదు స్థానాల్లో అహ్మదాబాద్ ఇండోర్ లు నిలిచాయి. బెంగళూరులో అప్పుడే పుట్టిన 156 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులను అనాధలుగా చేసి రోడ్డు పక్కన విడిచి వెళ్లినట్లు ఎన్సీఆర్బీ తెలిపింది. ముంబై లో 75 మంది అహ్మదాబాద్ లో మరో 75 మంది రోడ్డు పక్కన కనిపించినట్లు పేర్కొంది.

చిన్నారులను తల్లి తల్లి కడుపులోనుంచి బయటకు రానీయకుండా హత్యకు పాల్పడిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచిందని ఎన్సీఆర్బీ తెలిపింది. రెండో స్థానంలో మధ్యప్రదేశ్, మూడో స్థానంలో రాజస్థాన్ లు ఉన్నట్లు తెలిపింది. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ అని అధికారులు తెలిపారు.

ఇలా పసికందులను రోడ్డు మీద వదిలి వెళ్లడానికి కారణాలు కూడా ఉన్నాయి.  భారత దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్న దేశమైనప్పటికీ పేదరికం అనేది ఇలాంటి ఘటనలకు దారితీస్తుంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటితో పాటు పెళ్లికి ముందు తిరిగిన యువత గర్భం దాల్చే గానే పరువు పోతుంది అనే కారణంతో చిన్నారులను వదిలేస్తున్నారు.  మరికొందరైతే ఆడపిల్ల పుట్టిందని కారణంగా వదిలించుకోవాలని చూస్తున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది.