Begin typing your search above and press return to search.

‘‘తెలంగాణ భవన్’’ పేరు మారింది

By:  Tupaki Desk   |   21 July 2015 10:11 AM GMT
‘‘తెలంగాణ భవన్’’ పేరు మారింది
X
ఢిల్లీలోని తెలంగాణ భవన్ పేరు మారింది. ఎవరి ఒత్తిడితోనో.. మరెవరి బలవంతం మీదనో కాకుండా తెలంగాణ అధికారపక్షం తమకు తాముగా పేరు మార్చుకున్నట్లు ప్రకటించారు.

ఇకపై తెలంగాణ భవన్ ను.. తెలంగాణ సదన్ గా పిలవనున్నట్లు టీఆర్ఎస్ ఎంపీలు ప్రకటించారు. ఢిల్లీలోని తెలంగాణ సదన్ (అదే తెలంగాణ భవన్) లో బోనాల ఉత్సవాల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ ఎస్ ఎంపీలు పాల్గొన్నారు. బోనాల గురించి దేశానికి తెలిసేలా చేస్తామని పేర్కొన్నారు. అధికారం ఒక రోజు ఉంటుంది.. మరో రోజు ఉండదు. కానీ.. పేర్ల విషయంలో మిగిలిన పార్టీల అభిప్రాయాన్ని తీసుకొని.. నిర్ణయిస్తే బాగుంటుంది.

మంచి సంప్రదాయాన్ని మొదటి నుంచి పరిచయం చేసే అద్భుత అవకాశం టీఆర్ఎస్ కు ఉంది. అయితే.. ఎవరిని సంప్రదించకుండా.. తమకు నచ్చిన పేరును ప్రకటించేకన్నా.. అఖిలపక్షం నిర్ణయంతో ఇలాంటి పేరు మార్పు వ్యవహారాలు చేస్తే బాగుంటుంది. సమకాలీన రాజకీయాల్లో ఇంత విశాల హృదయం రాజకీయ పార్టీలకు ఉండే అవకాశం ఉందా..?