Begin typing your search above and press return to search.
చేస్తే ఢిల్లీలోనే ఉద్యోగం చేయాలి
By: Tupaki Desk | 28 July 2016 6:12 AM GMTచేసే ప్రతి పనిలోనూ అనుకూలతలు వెతుకుతాం. ప్రతికూలతల మధ్య పనిచేయాలంటే చాలా కష్టం. అన్నీ అనుకూలంగా ఉంటే బతుకు నల్లేరు మీద నడకలా సాగిపోతుంది. ఇక రోజూ చేసే ఉద్యోగమైతే చీకూచింతా లేకుండా సాగితేనే హ్యాపీ.. పనిలో ఆనందం, ఆఫీసులో మంచి వాతావరణంతో పాటు పనిచేసే ప్రాంతం కూడా ప్రధానమే. లక్షలు వేతనం - బ్రహ్మాండమైన హోదా ఉన్నా అడవిలో ఉద్యోగమైతే ఈ కాలంలో ఎవరు ఇష్టపడతారు. అందుకే ఉద్యోగం ఎక్కడ చేస్తున్నామన్నదీ ఇప్పుడు ముఖ్యమైపోయింది. అలా ఈతరం యువత ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతున్న నగరాలు ఏవన్నది తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. అందులో టాప్ టెన్ లో హైదరాబాద్ కూ స్థానం లభించింది. ఢిల్లీ ఫస్టు ప్లేస్ కొట్టేసింది.
ఏం రంగంలో పనిచేస్తున్నామన్నదే కాకుండా ఎక్కడ పనిచేస్తున్నామన్నదీ ముఖ్యమేనని యువత అంటున్నారు. ఉద్యోగం చేసేందుకు యువత ప్రాధాన్యమిచ్చే నగరాల్లో హైదరాబాద్ టాప్-10లో చోటు దక్కించుకుంది. పీపుల్ స్ట్రాంగ్ - కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండ్రస్టీ - అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ - లింక్ డ్ ఇన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను ఇండియా స్కిల్స్ రిపోర్టు-2016 వెల్లడించింది. వీబాక్స్ ఎంప్లాయిబలిటీ స్కిల్ టెస్ట్(వెస్ట్) పేరుతో దేశంలోని 29 రాష్ట్రాలు - ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో 5.2 లక్షలమంది నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ నివేదికను రూపొందించారు. 2014 నుంచి 2016 వరకు ఈ సర్వేను నిర్వహించారు.
ఇండియా స్కిల్ రిపోర్టు ప్రకారం ఢిల్లీ ఫస్టు ప్లేస్ కొట్టేయగా హైదరాబాద్ పదో స్థానం దక్కించుకుంది. బీటెక్ - ఫార్మా వంటి కోర్సులు పూర్తిచేసిన వారిలో ఎక్కువమంది ఉద్యోగం కోసం ఢిల్లీ అనువైనదంటూ దానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాత ఢిల్లీ చుట్టూ ఉన్న ఎన్సీఆర్ ప్రాంతాన్ని ఎంచుకోగా ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు - చెన్నై - లక్నో నిలిచాయి. ఇక మహిళా ఉద్యోగుల విషయానికొస్తే వారు మాత్రం హైదరాబాద్ ను బెస్టు ఆప్షన్ గా తీసుకోవడం లేదు.