Begin typing your search above and press return to search.
కేజ్రీవాల్ అధికారాలకు కత్తెర.. మండిపడుతున్న ఆప్..!
By: Tupaki Desk | 16 March 2021 9:30 AM GMTకేంద్ర ప్రభుత్వం మరో వివాదాస్పదమైన బిల్లును తెరమీదకు తీసుకొచ్చింది. ఢిల్లీలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సీఎం కేసీఆర్ అధికారాలకు భారీగా కోత విధించింది. అక్కడి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు విశేషాధికారాలు కట్టబెడుతూ ఓ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు..
తొలుత ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగానే ఉండేది. అయితే ఆ తర్వాత దీన్ని ప్రత్యేక అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత రాష్ట్రంగా ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కూడా ఉంటూ వస్తున్నారు.
అయితే ఒక్క పోలీస్‌శాఖ మినహా.. మిగతా అధికారాలన్ని అక్కడి అసెంబ్లీకి ఉంటాయి. మిగతా రాష్ట్రాల్లాగానే అక్కడి అసెంబ్లీలో బిల్లులు పాస్ చేస్తుంటారు. అయితే కేంద్రం తాజాగా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు విస్తృత అధికారాలు కట్టబెడుతూ ఓ బిల్లును తీసుకొచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటోరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు 2021ను కేంద్రం లోక్‌సభ ముందుంచింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డి ఈ బిల్లును లోక్‌సభ ముందుంచారు.
ఈ బిల్లు ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏ బిల్లు పెట్టాలన్న లెఫ్ట్నెట్ గవర్నర్ ఆమోదం ఉండాల్సిందే. అంటే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కేంద్రం ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు కాబట్టి ఇక ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ బిల్లు తీసుకొచ్చినా కేంద్రం ఆమోదం తెలపాల్సిందే. దీంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడుతున్నారు. కొత్త బిల్లు ద్వారా .. ఢిల్లీ కూడా మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతాలుగానే మారిపోనున్నది.
ఈ బిల్లును అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో బీజేపీ దారుణంగా ఓడిపోవడంతో .. ఢిల్లీపై పెత్తనం చెలాయించేందుకు ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన బిల్లును తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర నిర్ణయం ప్రజాస్వామాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన ఆరోపించారు. కొత్త బిల్లు ప్రకారం.. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అధికారాల్లో కోత పడనున్నది. అక్కడి ప్రభుత్వం ఏ బిల్లు తీసుకొచ్చినా ముందుగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంటుంది.