Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల‌తో స‌హా దేశంలో క‌రోనా కేసుల్లో 70 శాతం త‌బ్లిగీ పుణ్య‌మే

By:  Tupaki Desk   |   18 April 2020 5:30 PM GMT
తెలుగు రాష్ట్రాల‌తో స‌హా దేశంలో క‌రోనా కేసుల్లో 70 శాతం త‌బ్లిగీ పుణ్య‌మే
X
లాక్‌డౌన్ అమ‌లుచేసిన కొన్ని రోజుల‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు మీడియా ముందుకు వ‌చ్చి ఉత్సాహంగా మాట్లాడారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.. లాక్‌డౌన్ క‌న్నా ముందే క‌రోనా క‌ట్ట‌డి అవుతుంద‌ని ఆశాభావంతో ప్ర‌క‌టించారు. వాస్త‌వంగా ప‌రిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి. కానీ రెండు, మూడు రోజుల త‌ర్వాత ఢిల్లీలో త‌బ్లిగి జ‌మాత్ నిర్వ‌హించిన మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌లతో ఒక్క‌సారిగా తెలంగాణ‌తో పాటు దేశంలో ప‌రిస్థితులు మారి పోయాయి. అక్క‌డికి వెళ్లివ‌చ్చిన వారిలో క‌రోనా సోకిన వారు ఉండ‌డంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా విజృంభించింది. పెద్ద‌ సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి ఇప్పుడు ఏకంగా 13 వేలు దాటాయి. ఇదంతా త‌బ్లిగీ ప్రార్థ‌న‌ల పుణ్య‌మే. ఆ కేసుల‌న్నింటిలో 70శాతం త‌బ్లిగీ ప్రార్థ‌న‌ల‌తోనే క‌రోనా వైర‌స్ బాధితులు ఉన్నార‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

దేశంలో అదుపులోకి వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి క‌రోనా వైర‌స్ త‌బ్లిగీ ప్రార్థ‌న‌ల‌తో ఒక్క‌సారిగా పెరిగిపోయాయి. అక్క‌డి నుంచి వ‌చ్చిన వంద‌ల మంది క‌రోనా బారిన ప‌డ్డారు. వారి వ‌ల‌న మ‌రికొంద‌రికి ఆ కొంద‌రు మరింత మందికి వ్యాపించి ఇప్పుడు భార‌త‌దేశం లో ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం త‌బ్లిగీ ప్రార్థ‌నలే. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీని నేప‌థ్యం లోనే అదుపులోకి వ‌చ్చిన తెలంగాణ‌ లో ప్ర‌స్తుతం క‌రోనా కేసులు 766కు చేరాయి. దేశం మొత్తంలో కేసులు 13 వేలు దాటాయి, మృతులు 400కు చేరాయి.

ఈ నేప‌థ్యంలో త‌బ్లిగీ ప్రార్థ‌న‌ల‌తో ఏ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తికి ఎంత దోహ‌ద‌ప‌డిందో కొంద‌రు చార్ట్ రూపొందించారు. దాని ప్ర‌కారం దేశ‌వ్యాప్తంగా న‌మోదైన మొత్తం కేసులల్లో 70 శాతానికి పైగా త‌బ్లిగి ప్రార్థ‌న‌లే కార‌ణ‌మ‌ని స్ప‌ష్టం చేస్తోంది. ఆ లెక్క‌ల ప్ర‌కారం అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ లో క‌రోనా రావ‌డానికి త‌బ్లిగి ప్రార్థ‌న‌లే కార‌ణ‌మ‌ట‌. అంత‌కు ముందు ఆ రాష్ట్రం కరోనా వ్యాప్తి చెంద‌లేదు. ఇక అండ‌మాన్ నికోబార్ దీవుల్లోని కేసుల్లో 91 శాతం త‌బ్లిగి ప్రార్థ‌న వ‌ల‌న క‌రోనా వైర‌స్ వ్యాపించింది.

త‌మిళ‌నాడులో న‌మోదైన కేసుల్లో 89.6 శాతం, అస్సాం కేసుల్లో 84.9 శాతం త‌బ్లిగీ ప్రార్థ‌న‌ల‌తో క‌రోనా వైర‌స్ విజృంభించింది.
తెలంగాణ‌లో 78.8 శాతం
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 70.4 శాతం
ఢిల్లీలో 68.4 శాతం
హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 63.6 శాతం
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 58.2 శాతం
హ‌రియాణాలో 53.2 శాతం

ఈ విధంగా ఆయా రాష్ట్రాల్లో మొత్తం క‌రోనా కేసుల్లో త‌బ్లిగీ ప్రార్థ‌న‌ల వ‌ల‌న వ్యాపించిన‌వే సింహ భాగంగా ఉన్నాయి. క‌రోనా వ్యాప్తికి ఆ ప్రార్థ‌న‌లు దోహ‌దం చేయ‌డంతో ప్ర‌స్తుతం త‌బ్గిగీ సంస్థ‌పై కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఈ సంద‌ర్భం గా ఆ సంస్థ చీఫ్‌ పై ప‌లు రకాలు కేసులు న‌మోదు చేయ‌గా.. ప్ర‌స్తుతం అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంది.