Begin typing your search above and press return to search.
మర్కజ్ ఎపిసోడ్ కొలిక్కి వస్తే.. కరోనా ఖతమేనా?
By: Tupaki Desk | 8 April 2020 4:00 AM GMTరాత్రి తర్వాత పగలు ఎంత పక్కానో.. మనిషి జీవితంలో బాధ ఎక్కువ కాలం వెంట ఉండదు. బాధ తర్వాత సంతోషం.. దాని తర్వాత బాధ.. ఇలా చక్రం మాదిరి తిరుగుతూ ఉంటుంది. గడిచిన వందేళ్లలో మానవాళి ఎప్పుడూ ఎదుర్కోని సంక్షోభాన్ని కరోనా పుణ్యమా అని ఎదుర్కొందని చెప్పాలి. చుట్టూ చిమ్మ చీకటి. కనుచూపు మేర కనిపించని కాంతిరేఖ. ఇలాంటివేళ సానుకూల పరిణామాలు సరికొత్త శక్తిని ఇస్తుంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది.
మిగిలిన దేశాలతో పోలిస్తే.. కరోనా కేసుల విషయంలో భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందనే చెప్పాలి. మర్కజ్ ఎపిసోడ్ కానీ లేని పక్షంలో ఇప్పటికే పరిస్థితి సానుకూలంగా ఉండేది. తాజాగా నమోదవుతున్న పరిణామాలు.. గణాంకాల్ని చూస్తే.. రానున్న రోజులు మరింత మంచిగా ఉండే అవకాశం ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏపీ.. తెలంగాణలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలే దీనికి నిదర్శనంగా చెప్పాలి. ఏప్రిల్ మొదటి రెండు రోజుల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదై.. విపరీతమైన భయాందోళనలకు గురి చేయటం తెలిసిందే.
మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి లెక్క కొలిక్కి వచ్చి.. వారందరికి పరీక్షలు జరిపి.. వారితో కాంటాక్టులో ఉన్న వారికి పరీక్షలు నిర్వహిస్తే.. కరోనా ఏ మేర విస్తరించిందన్న విషయంపై ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి. దీనికి తగ్గట్లే మంగళవారం నమోదైన కేసులు సంఖ్య ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. గడిచిన కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున నమోదవుతున్న కేసులకు భిన్నంగా వరుసగా రెండు రోజులు (ఏప్రిల్ 6,7 తేదీల్లో) కరోనా కేసుల నమోదు తక్కువగా ఉంది. ఈ పరిస్థితి ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ చోటు చేసుకుందని చెప్పాలి.
ఏపీ విషయానికి వస్తే ఏర్పిల్ ఐదున 62 కేసులు నమోదైతే.. ఏప్రిల్ ఆరున 51 కేసులు నమోదయ్యాయి. ఇందుకు భిన్నంగా ఏప్రిల్ 7న మాత్రం కేవలం పదకొండు కేసులు మాత్రమే పాజిటివ్ గా తేలాయి. మార్చి 31 తర్వాత తక్కువగా కేసులు నమోదైంది ఏప్రిల్ ఏడున మాత్రమే కావటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు అనిపించే అంశం ఒక్కటే. రెండు తెలుగు రాష్ట్రాల్లో మర్కజ్ కేసుల లెక్క తేలి.. ఒక కొలిక్కి వస్తే కరోనాను ఖతం చేసినట్లేనన్న భావన వ్యక్తమవుతోంది. తర్వాతి రోజుల్లోనూ భౌతిక దూరాన్ని పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకుంటే కరోనాకు చెక్ పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పక తప్పదు.