Begin typing your search above and press return to search.

కరోనా వ్యాప్తిలో ముస్లి మత పెద్దలకూ పాత్ర... ఇదిగో సాక్ష్యం

By:  Tupaki Desk   |   1 April 2020 3:45 AM GMT
కరోనా వ్యాప్తిలో ముస్లి మత పెద్దలకూ పాత్ర... ఇదిగో సాక్ష్యం
X
ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి కోసం అన్ని దేశాలు కఠినాతికఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు చాలా దేశాలు లాక్ డౌన్ పేరిట సరిహద్దులను మూసేసి... జనాలను బయటకు రానీయకుండా ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మత ప్రార్థనలంటూ ఢిల్లీలోకి ఎంట్రీ ఇచ్చిన విదేశీ ముస్లిం మతపెద్దలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మత పెద్దలు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా తేలింది. ఓ వైపు ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ కేంద్రానికి వచ్చిన ముస్లింల నుంచి తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని చాలా రాష్ట్రాలకు కరోనా సోకిందన్న వార్తలు వస్తున్నా... మర్కజ్ కు వచ్చిన మత పెద్దలు మాత్రం ఉత్పాతం తమకేమీ పట్టనట్టే వ్యవహరించారని చెప్పాలి. వీరు చేసిన ఓ పని ఢిల్లీలోని మిగిలిన ప్రాంతాలతో పాటు మరిన్ని రాష్ట్రాలకు కరోనా పాకే ప్రమాదం లేకపోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అయినా మర్కజ్ కు వచ్చిన ముస్లిం మత పెద్దలు అంత నిర్లక్ష్యమైన పని ఎందుకు చేశారన్న విషయానికి వస్తే... మర్కజ్ లో జరిగిన మత ప్రార్థనలకు హాజరైన మెజారిటీ ముస్లిం సోదరులు కరోనా బారిన పడ్డారన్న వార్తల నేపథ్యం లో మర్కజ్ లో ఉన్న కొంతమంది ముస్లిం మత పెద్దలను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించే యత్నం చేశారు. ఈ క్రమంలో ఓ బస్సును మర్కజ్ వద్దకు తీసుకొచ్చిన పోలీసులు మత పెద్దలను అందులో ఎక్కించారు. బస్సు ఆసుపత్రికి బయలేరిన కొద్ది సేపట్లోనే... బస్సులోని మత పెద్దలు బస్సు కిటికీలను తెరిచి రోడ్డు పై ఇష్టారాజ్యంగా ఉమ్మి వేశారట. కరోనా సోకిన వ్యక్తుల ఉమ్మి నుంచి కూడా ఆ వైరస్ వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని చాలా ఈజీగా తీసుకున్న మత పెద్దలు పదే పదే ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయడం మొదలెట్టారట.

ఈ దృశ్యాలను చూసిన పోలీసులు షాక్ తిన్నారట. ఓ వైపు మర్కజ్ కు వచ్చిన వారి నుంచే దేశంలోని చాలా రాష్ట్రాల వారికి కరోనా సోకుతుందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్న సంగతి తెలిసి కూడా మత పెద్దలు ఇలా బస్సులో వెళుతూనే ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయడం ఏమిటని ఆగ్రహానికి గురయ్యారట. ఆ వెంటనే అదే విషయాన్ని మత పెద్దలకు చెప్పడంతో పాటుగా... తమ మాటను మత పెద్దలను పాటించే పరిస్థితి కనిపించకపోవడంతో పోలీసులే... బస్సు అద్దాలను మూసేశారట. ఓ వైపు మర్కజ్ కు వచ్చిన వారి కారణంగా చాలా మందికి వ్యాధి సోకుతోందన్న వార్తలు కలకలం రేపుతున్న విషయాన్ని మరిచి మత పెద్దలు ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేసిన దృశ్యాలను ఓ నేషనల్ న్యూస్ ఛానెల్ పట్టేసి ప్రసారం చేసింది. ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్ గా మారి పోయాయి.