Begin typing your search above and press return to search.

ఢిల్లీ మెట్రోగర్ల్ కథేంటి? బికినీలో ఎందుకొచ్చింది?

By:  Tupaki Desk   |   4 April 2023 10:00 PM GMT
ఢిల్లీ మెట్రోగర్ల్ కథేంటి? బికినీలో ఎందుకొచ్చింది?
X
ఢిల్లీ మెట్రో గర్ల్.. ఇప్పుడు అందరూ ఈమె గురించే చర్చిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన ఈమె కథ అందరికీ ఆసక్తి రేపుతోంది. జనాల నోళ్లలో నానుతున్న ఈమె చేసిన పని ఏంటంటే.. ఢిల్లీ మెట్రోలో చిన్న బ్రా, బికినీ వేసుకొని ప్రయాణించడమే. అందరూ ప్రయాణికులను షాక్ కు గురిచేసిన ఈ అమ్మాయి ఎవరు? ఏంటి కథ అన్నది కొన్ని మీడియాలు ఆరాతీశాయి.

ఢిల్లీ మెట్రో గర్ల్ గా పేరొంది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ అమ్మాయి పేరు రిథమ్ చనవా.. వయసు 19 ఏళ్లే. ఢిల్లీ మెట్రోలో బ్రా, మిని స్కర్ట్ లాంటి బికినీతో ఈమె రైలులో ప్రయాణించి ప్రయాణికులకు షాకిచ్చింది. ఈమెను అందరూ తిట్టడం ప్రారంభించారు. సమాజాన్ని భ్రష్టుపట్టిస్తావా? ఇలా అర్థనగ్నంగా పబ్లిక్ లో తిరిగి అని తిట్టిపోశారు.

దీంతో ఈమె ఎవరా? అని ఆరాతీయగా ఆమె గురించి వివరాలను ఓమీడియా ఇంటర్వ్యూ చేసి బయటపెట్టింది. ఆమె పేరు రిథమ్ చననా.. ఊరు పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్ నగరం. చిన్నప్పటి నుంచి పద్ధతిగానే పెరిగింది. ఉండేది. సంప్రదాయ కుటుంబంలోనే ఉన్న ఈమె సడెన్ గా మారిపోయిందని తేలింది. తన ఆలోచనలు మారాయని.. ఆమె ప్రవర్తన ఇంట్లో వారికి నచ్చకపోవడంతో దూరంగా ఢిల్లీ వచ్చేసిందని తేలింది.

తాను ఇలా బికినీలు వేసుకోవడంపై ఎవరి ప్రభావం లేదని.. ఇష్టప్రకారమే ఇలాంటి బట్టలు వేసుకుంటున్నట్టు తెలిపింది. పేరు పబ్లిసిటీ కోసం తాను బతకడం లేదని.. విమర్శలను తాను పట్టించుకోనని పేర్కొంది. తనకు నచ్చినట్టు బతుకుతానని తెలిపింది. తాను ఎవరి జీవితాల్లోకి తొంగి చూడను అని.. తన జీవితంలోకి ఎవరూ రావద్దని.. స్వేచ్ఛగా ఉండనివ్వండని.. తన వస్త్రధారణపై ఎక్కడ ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని పేర్కొంది. మెట్రోలో తప్ప తాను బయట బాగానే ఉన్నానని వివరించింది.

అయితే రిథమ్ గత ఏడాది అక్టోబర్ వరకూ చుడీదార్, సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించింది. ఆమె నార్మల్ యువతిలాగానే ఉంది. కానీ ఎందుకో రిథమ్ కొన్ని నెలలుగా మారిపోయింది. రెచ్చిపోతూ ఇలా కురుచదుస్తుల్లో కనిపిస్తోంది.

-ఢిల్లీ మెట్రో డిపార్ట్ మెంట్ అభ్యంతరం.. వార్నింగ్

యువతి ఇలా బికినీ వేసుకొని మెట్రోలో తిరగడంపై ఢిల్లీ మెట్రో డిపార్ట్ మెంట్ అభ్యంతరం తెలిపింది. వార్నింగ్ ఇచ్చింది. ఢిల్లీ మెట్రో సోమవారం ఒక ప్రకటనలో, “సమాజంలో ఆమోదయోగ్యమైన అన్ని సామాజిక మర్యాదలు పాటించాలి. ప్రోటోకాల్‌లను దాని ప్రయాణికులు అనుసరించాలని’ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. "ప్రయాణికులు ఇతర తోటి ప్రయాణీకుల సున్నితత్వాన్ని కించపరిచే ఏ విధమైన చర్యలో పాల్గొనకూడదు లేదా ఎలాంటి దుస్తులు ధరించకూడదు" అని పేర్కొంది. డీఎంఆర్ సీ యొక్క ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ "సెక్షన్ 59 ప్రకారం అసభ్యతను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు" అని అర్బన్ ట్రాన్స్‌పోర్టర్ అధికారి తెలిపారు. మెట్రోలో బికినీ వేసుకొని తిరిగితే శిక్షార్హం అంటూ హెచ్చరించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.