Begin typing your search above and press return to search.

మెట్రోలో శృంగారం.. వీడియో వైరల్

By:  Tupaki Desk   |   31 July 2019 5:16 AM GMT
మెట్రోలో శృంగారం.. వీడియో వైరల్
X
అర్ధరాత్రి మెట్రో స్టేషన్ లో ఎవరుంటారు. అందుకే ఆ జంట రెచ్చిపోయింది. తమను ఎవరూ చూడడం లేదనుకొని శృంగారం కానిచ్చేశారు. అయితే మెట్రో రైల్వే స్టేషన్ లోని సిసీ కెమెరాల్లో ఇదంతా రికార్డ్ అయ్యింది. దీంతో వెంటనే ఆన్ లైన్లో ప్రత్యక్షమైంది. వైరల్ గా మారిన ఈ వీడియో వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

ఢిల్లీ మెట్రో రైల్వేస్టేషన్ లో ఇటీవల ఓ జంట శృంగారానికి పాల్పడింది. అది సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. వెంటనే ఆన్ ల్లోకి.. పోర్న్ వెబ్ సైట్ లోకి ఎక్కేసింది. దాన్ని డౌన్ లోడ్ చేసుకొని నెటిజన్లు వైరల్ చేశారు.

కాగా ఢిల్లీ మెట్రో స్టేషన్ లో శృంగారానికి పాల్పడిన సదురు జంటపై ఢిల్లీ మెట్రో సీఈవో ఆజాద్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మెట్రోల్లో ఎవరూ ఇలాంటి పనులకు పాల్పడవద్దని మెట్రో సీఈవో విన్నవించారు.

కాగా ఢిల్లీలోని మెట్రో కంట్రోల్ రూంకు మాత్రమే పరిమితమవ్వాల్సిన వీడియో - సీసీ ఫుటేజీలు ఆన్ లైన్ లోకి పోర్న్ సైట్ లోకి రావడంపై మెట్రో యాజమాన్యం సీరియస్ అయ్యింది. ఎవరు చేశారనే దానిపై ఆరాతీస్తున్నారు. మెట్రోల్లో పనిచేసే సీసీ ఫుటేజీ ఆపరేటర్లే ఈ పనిచేశారని విచారణ చేపట్టారు.