Begin typing your search above and press return to search.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌ విప‌క్షాలు మోడీని ఏమీ చేయ‌లేవా?!

By:  Tupaki Desk   |   9 March 2023 3:08 PM GMT
ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌ విప‌క్షాలు మోడీని ఏమీ చేయ‌లేవా?!
X
ఢిల్లీలో వెలుగు చూసిన లిక్క‌ర్ కుంభ‌కోణంలో మంత్రుల అరెస్టుల నుంచి ఏపీ, తెలంగాణ‌లోని నేత‌ల వ‌ర‌కు ఉచ్చు బిగుసుకుంది. అయితే.. ఇదంతా కూడా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ కుట్రతోనే సాగుతోం ద‌న్న‌ది విప‌క్షాలు స‌హా ఆయా నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌లు. కానీ, వాస్త‌వానికి చూస్తే.. పైకి మాత్రం ఆధారాల‌తో స‌హా నిరూపించే అవ‌కాశం మాత్రం లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

అందుకే లిక్క‌ర్ కుంభ‌కోణం వెలుగు చూసిన త‌ర్వాత‌.. విప‌క్షాలు మోడీని కేంద్రంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నా.. ఆయ‌న‌పై నేరుగా ఎలాంటి ఫిర్యాదులు కానీ, న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించే అవ‌కాశం కానీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం.. మోడీ సునాయాసంగా త‌ప్పించుకునే అవ‌కాశం ఉండ‌డ‌మే. ఎందుకంటే.. లిక్క‌ర్ విధానం అనేది.. రాజ్యాంగం ప్ర‌కారం.. రాష్ట్రాల జాబితాలోని అంశం.

అంటే.. లిక్క‌ర్‌పై నియంత్ర‌ణ‌, ధ‌ర‌ల నిర్ణ‌యం... అస‌లు ఉంచాలా వ‌ద్దా.. ఆదాయ వ్య‌యాలు.. వంటివి అన్నీ కూడా రాష్ట్రాల‌కే ద‌ఖ‌లు ప‌డ్డాయి. పూర్తిగా రాష్ట్ర ప్ర‌భుత్వాల నిర్ణ‌యం మేర‌కే.. లిక్క‌ర్ పాల‌సీలు ఆయా రాష్ట్రాల్లో ముందుకు సాగుతాయి. సో.. ఈవిష‌యంలో కేంద్రం ఇన్వాల్వ్‌మెంట్ కానీ, కేంద్రాన్ని త‌ప్పు ప‌ట్టే ప‌రిస్థితి కానీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అయితే... ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని ఎందుకు ఇరికించాల్సి వ‌చ్చింద‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఢిల్లీలో ప్ర‌భుత్వం స‌ర్వ‌తంత్ర స్వ‌తంత్ర స‌ర్కారు కాక‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం. ఇది కేంద్ర పాలిత ప్రాంతం. ప్ర‌జామోదం ప్ర‌కార‌మే ప్ర‌భుత్వం ఏర్పడినా.. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కే ఎక్కువ‌గా అధికారాలు ద‌ఖ‌లు ప‌డ్డాయి. అయితే.. ఇక్క‌డ కూడా కీల‌క విష‌యం ఉంది. లిక్క‌ర్ విష‌యంలో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ జోక్యం స‌రికాద‌నే అభిప్రాయం ఉంది.

అయిన‌ప్ప‌టికీ.. రాజ‌కీయ జోక్యం కార‌ణంగా.. లెఫ్టినెంట్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై హుటాహుటిన సీబీఐ రంగంలోకి దిగ‌డం... ఈడీ జోక్యం చేసుకోవ‌డం వంటివి జ‌రిగాయి. అదే రాజ‌కీయ జోక్యం లేకుండా ఉంటే.. ఇక్క‌డ కూడా ఆప్ స‌ర్కారుకు స్వేచ్ఛ ఉండేది. ఏదేమైనా.. మోడీ పాత్ర ఉంద‌ని ఆరోపిస్తున్న‌ప్ప‌టికీ.. లిక్క‌ర్ విష‌యం రాష్ట్రాల జాబితాలో ఉండ‌డంతో ఆయ‌న సేఫ్ అయిపోతారనేది నిపుణుల మాట‌.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.