Begin typing your search above and press return to search.

లిక్కర్ స్కామ్ లో బుచ్చిబాబే కీలకమా ?

By:  Tupaki Desk   |   28 May 2023 11:05 AM GMT
లిక్కర్ స్కామ్ లో బుచ్చిబాబే కీలకమా ?
X
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ కు చెందిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబే కీలకమని ఈడీ తేల్చేసిందా ? కోర్టులో దాఖలు చేసిన తాజా ఛార్జి షీటులో ఈడీ ఇదే విషయాన్ని స్పష్టగా చెప్పింది. లిక్కర్ స్కామ్ లో కీలకపాత్ర పోషించిన సౌత్ గ్రూపులో బుచ్చిబాబు కీరోల్ ప్లేచేసినట్లు ఈడీ చెప్పింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ డాక్యుముంట్ బుచ్చిబాబు వాట్సప్ కు వచ్చిందట. దాన్ని ఆడిటర్ చూసి అవసరమైన మార్పులు చేసిన మళ్ళీ తిరిగి పంపిన తర్వాతే పాలసీని ప్రభుత్వం ఓకే చేసిందని ఈడీ తేల్చింది.

ఈ విషయమై బుచ్చిబాబు ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో నాలుగు రోజులున్నారని కూడా ఈడీ చెప్పింది. అరబిందో శరత్ చంద్రారెడ్డి, అరుణ్ పిళ్ళయితో కలిసి ఆడిటర్ చాలాసార్లు సమావేశమైనట్లు తమ దర్యాప్తులో తెలిసిందని ఈడీ చెప్పింది. మరికొందరికి కూడా స్కామ్ తో సంబంధముందని ఈడీ చెప్పింది. తొందరలోనే దాఖలు చేయబోయే అనుబంధ ఛార్జిషీట్లలో వాళ్ళ వివరాలను అందిస్తామని తాజా చార్జిషీట్లో ఈడీ పేర్కన్నది.

ఈడీ దాఖలుచేసిన తాజా చార్జిషీట్ చూసిన తర్వాత అనేక సందేహాలు పెరిగిపోతున్నాయి. అవేమిటంటే అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీని మార్పులు చేసేంత శక్తి బుచ్చిబాబుకు ఉందా ? ఆప్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాకా ఆడిటర్ ఎలా వెళ్ళగలిగారు ? ఒక ప్రభుత్వ పాలసీలో మార్పులు చేసేంత సీన్ ఒక ఆడిటర్ కు ఉంటుందా ? అసలు బుచ్చిబాబు లిక్కర్ స్కా సీన్లోకి వచ్చిందే కల్వకుంట్ల కవిత ఆడిటర్ గా. కవిత ఆడిటర్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బుచ్చిబాబు పాత్రుందంటే అర్ధముంది. పోనీ కవితకు గతంలో బుచ్చిబాబు ఆడిటర్ గా పనిచేశారని చెప్పినా పాలసీ మార్చటంలో అవకాశముందని అనుకోవచ్చు.

ఎలాగంటే ఇక్కడ కవితే కీలకం కానీ ఆడిటర్ కాదు. ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన పాలసీ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం కవితకు ఎక్కువగా ఉంటుందే కానీ బుచ్చిబాబుకు ఉండదు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురుగా కవితకు ఢిల్లీ సీఎంతో పరిచయం, సన్నిహితం ఉందంటే నమ్ముతారు. కవిత ద్వారానే స్కామ్ లో అరుణ్ పిళ్ళై, ఆడిటర్ లాంటి చాలామంది పాత్రదారులయ్యారని ఇంతకాలం ఈడీ చెప్పింది. అలాంటిది ఇపుడు హఠాత్తుగా బుచ్చిబాబే కీలకమంటే నమ్ముతారా ?