Begin typing your search above and press return to search.
టార్చర్ మామూలుగా లేదుగా ?
By: Tupaki Desk | 16 April 2023 10:18 AM GMTఆర్ధిక నేరాలపై అరెస్టయి ఢిల్లీ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖరన్ పెడుతున్న టార్చర్ మామూలుగా లేదు. మామూలుగా పోలీసులు కదా నేరస్తులను టార్చర్ పెట్టేది అని అనుకుంటున్నారా ? నిజమే, బయటున్న కవితను జైల్లో ఉన్న సుఖేష్ ఏ విధంగా టార్చర్ పెడుతున్నాడు ? ఏ విధంగా అంటే వారానికి ఒక లేఖను విడుదల చేస్తు అందులో కవితకు తనకు మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్ ను రిలీజ్ చేయటం ద్వారా.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ డబ్బును తాను ఎవరి ఆదేశాల ప్రకారం హైదరాబాద్ కు తీసుకొచ్చి ఎక్కడ అందించింది, ఎవరికి అందించింది, తాను ఏ కారులో కూర్చుని డబ్బులు ఎవరికి ఇచ్చాడనే వివరాలను విడతల వారీగా చెప్పాడు. శనివారం విడుదల చేసిన లేఖలో తనకు కవితకు మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్ వివరాలను కూడా ఇచ్చాడు. నాలుగు రోజుల క్రితం రిలీజ్ చేసిన చాటింగ్ పై కవిత స్పందిస్తూ తనకు సుఖేష్ ఎవరో తెలీదన్నారు. ఎవరో తెలీని వ్యక్తితో ఆర్ధిక సంబంధాలు ఎలా పెట్టుకుంటానని కవిత మీడియాపై మండిపడ్డారు.
దానికి కంటిన్యుయేషన్ గానే తాజా లేఖలో మరిన్ని స్క్రీన్ షాట్లను పెట్టాడు. స్క్రీన్ షాట్లు పెడుతు వెల్ కమ్ టు తీహార్ జైల్ క్లబ్ అంటు కవితను ఉద్దేశించి ఎద్దేవా చేశాడు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తర్వాత వంతు నీదే అంటు కవితను ఉద్దేశించి సుఖేష్ ఎద్దేవా చేశాడు. ఇలా తడవకొక లేఖను విడుదలచేస్తు వాట్సప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు రిలీజ్ చేస్తు జైల్లో కూర్చుని బయటున్న కవితను సుఖేష్ టార్చర్ పెట్టడం కాక మరేమిటి ?
లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని మూడుసార్లు ఈడీ విచారణ కోసమని ఆఫీసుకు వెళ్ళినపుడు కూడా కవిత ఇంతటి టార్చర్ ను ఎదుర్కోలేదేమో. మూడురోజుల విచారణలో ఈడీ ఏమడిగిందో కవిత ఏమి చెప్పారో ఎవరికీ తెలీదు. సుఖేష్ ఎవరో తనకు తెలీదు అని కవిత గొంతు పెంచి చెప్పే కొద్దీ కవిత తనకు ఎంతటి సన్నిహితురాలో వాట్సప్ చాటింగ్ ద్వారా సుఖేష్ ప్రపంచానికి చాటి చెబుతున్నాడు. ఇంకెన్ని చాటింగులున్నాయో, ఇంకెన్ని విషయాలు బయటకొస్తాయో కవిత-సుఖేష్ కే తెలియాలి.