Begin typing your search above and press return to search.

దేశ రాజధాని మరీ అంత డేంజరా?

By:  Tupaki Desk   |   25 March 2016 5:17 AM
దేశ రాజధాని మరీ అంత డేంజరా?
X
ఘనతలు సాధించే విషయంలో వెనుకబడి ఉన్నా.. కొన్ని మరకల విషయంలో మాత్రం భారత్ చాలాముందుంది. తాజాగా అలాంటిదే మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలో మహిళల భద్రత అత్యంత తక్కువగా ఉండే నగరాలకు చెందిన జాబితాను ఒకటి తయారు చేశారు. బ్యాడ్ లక్ ఏమిటంటే.. ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ టాప్ ఫైవ్ నగరాల్లో ఒకటిగా నిలవటం.

అయితే.. మహిళ భద్రత విషయంలో పలుదేశాల రాజధాని నగరాలు తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న విషయం జాబితాను చూస్తే అర్థమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 16 దేశాల రాజధానులు.. 20 ముఖ్యనగరాల్లో అధ్యయనం చేయగా.. మహిళల భద్రత దారుణంగా ఉన్న నగరాల్ని ఎంపిక చేశారు. ఈ జాబితాలో ఢిల్లీ నాలుగో స్థానంలో నిలవటం షాకింగ్ అని చెప్పక తప్పదు. ఇక.. మహిళలు భారీగా వేధింపులకు గురి అవుతున్న దేశాల లెక్క చూస్తే..

1. బొగోటో (కొలంబియా)

2. మెక్సికో సిటీ

3. లిమా (పెరూ)

4. న్యూఢిల్లీ

5. జకార్తా

6. బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా)

7. కౌలాలంపూర్

8. బ్యాంకాక్

9. మాస్కో

10. మనీలా

11. పారిస్

12. సియోల్

13. లండన్

14. బీజింగ్

15. టోక్యో

16. న్యూయార్క్