Begin typing your search above and press return to search.

ఆ మూడు రాష్ట్రాల్లో లావాటోళ్లు ఎక్కువ

By:  Tupaki Desk   |   9 March 2016 10:30 PM GMT
ఆ మూడు రాష్ట్రాల్లో లావాటోళ్లు ఎక్కువ
X
మారిన జీవన విధానం మనిషి రూపురేఖల్ని మార్చేస్తుంటుంది. విభిన్న సంస్కృతులున్న దేశంలో లావాటోళ్లు ఉన్న రాష్ట్రాలు ఏమిటి? స్లిమ్ గా జనాలుండే రాష్ట్రాలేమిటన్న లెక్కల్లోకి వెళితే ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి. లావాటోళ్లు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లోకి వెళితే సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా చెప్పే పంజాబ్ మొదటి స్థానంలో ఉంటే.. ఆ రాష్ట్రం తర్వాతి స్థానం కేరళదే కావటం గమనార్హం. ఫస్ట్.. సెకండ్ ప్లేస్ ల తర్వాత థర్డ్ ప్లేస్ లోకి వెళితే ఢిల్లీ రాష్ట్రం నిలుస్తుంది. లావాటోళ్ల రాష్ట్రం అంటే.. శరీర బరువు ఉండాల్సిన దాని కంటే ఎక్కుగా ఉండటం అన్న మాట.

అలాంటి జనాభా ఉన్న రాష్ట్రాల్లోకి వెళితే.. పంజాబ్ లోని పురుషుల్లో 22.2 శాతం.. మహిళల్లో 29.9 శాతం మంది ఉండాల్సిన లావు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. లావుపాటి ప్రజలున్న రాష్ట్రాల్లో సెకండ్ ప్లేస్ లో ఉన్న కేరళ మగాళ్లలో 17.8 శాతం.. ఆడోళ్లలో 28.1 స్థూలకాయంతో ఉంటే.. ఇక ఢిల్లీ మగాళ్ల విషయానికి వస్తే.. 16.8 శాతం మంది లావుగా ఉన్నారని.. మహిళల్లో ఇది 26.4 శాతం ఉన్నట్లు తేలింది. మొత్తంగా దేశంలోని 130కోట్ల జనాభాలో 6.91 కోట్ల మంది డబుల్ ఎక్స్ ఎల్ సైజ్ ఉన్నోళ్లుగా చెప్పొచ్చు.

ఇక.. స్లిమ్ గా ఉండే జనాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల విషయానికి వస్తే.. త్రిపుర నిలిస్తే.. మేఘాలయ రెండో స్థానంలో నిలుస్తుంది. ఇక్కడ లావాటోళ్లు బాగా తక్కువ. డబుల్ ఎక్స్ ఎల్ సైజున్నోళ్లు ఐదారు శాతంలోనే ఉండటం గమనార్హం.​