Begin typing your search above and press return to search.

బ్లర్ ఫ్లూ ఎఫెక్ట్ ... చికెన్ వంటకాలు నిషేదించిన ఢిల్లీ సర్కార్ !

By:  Tupaki Desk   |   13 Jan 2021 5:07 AM GMT
బ్లర్ ఫ్లూ ఎఫెక్ట్ ... చికెన్ వంటకాలు నిషేదించిన ఢిల్లీ సర్కార్ !
X
దేశవ్యాప్తంగా పక్షులకు సంబంధించి బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి పై ఆందోళన కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు బయట పడడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పెద్ద మొత్తంలో పక్షులు చనిపోతుండడంతో మనుషుల్లోనూ దీనిపై ఆందోళన మొదలయింది. చికెన్, గుడ్ల విక్రయాలు దారుణంగా పడిపోవడంతో ధరలు కూడా నేలను తాకాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో చికెన్, గుడ్ల విక్రయాలను కూడా కొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు. ఇప్పటికే దేశంలోని ఏడు రాష్ట్రాలను తాకిన ఈ వైరస్‌.. తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లోనూ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

దీంతో ఏవియన్‌ ఇన్‌ ఫ్లుయెంజా సోకిన రాష్ట్రాల సంఖ్య పదికి చేరింది. అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకాలపై ఆంక్షలు విధించొద్దని రాష్ట్రాలకు కేంద్ర పశుసంవర్థక, మత్స్య శాఖ స్పష్టం చేసింది. మానవులకు బర్డ్‌ ఫ్లూ సోకుతుందనేదానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదని తెలిపింది. బయటి నుంచి వచ్చే చికెన్ ‌ను నిషేధిస్తున్నామని ఢిల్లీ సర్కార్‌ ప్రకటించడంతో కేంద్రం ఈ ప్రకటన చేసింది. అటు, ఘాజీపూర్ ‌లోని పౌల్ట్రీ మార్కెట్‌ ను కూడా 10రోజుల పాటు మూసేసింది ఢిల్లీ ప్రభుత్వం. హోటళ్లలో ప్రాసెసెడ్ చికెన్ సర్వ్ చేయొద్దు అని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీచేశారు. కొన్ని ప్రాంతాల్లో చికెన్, గుడ్ల విక్రయాలను కూడా కొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు.

మహారాష్ట్రలోని పర్భణీ, ముంబయి, ఠాణె, బీడ్‌, దపోలి ప్రాంతంలో చనిపోయిన పక్షుల మరణానికి బర్డ్ ‌ఫ్లూయే కారణమని తేలింది. ఈ విషయాన్ని భోపాల్‌ ప్రయోగశాల ధ్రువీకరించింది. అటు, ఉత్తరాఖండ్ ‌నూ బర్డ్‌ ఫ్లూ వణికిస్తోంది. దెహ్రాదూన్‌, రిషికేశ్‌ లో దాదాపు 200కు పైగా రకాల పక్షులు చనిపోయాయి. వీటి నమూనాలను ప్రయోగశాలకు పంపారు. ఇటు, తెలుగు రాష్ట్రాలనూ బర్డ్‌ ఫ్లూ భయం వెంటాడుతోంది. అయితే, దీనివల్ల మనుషులకు ఎలాంటి నష్టం జరగలేదని.. ప్రజలెవరూ భయపడాల్సిన పన్లేదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇక, బర్డ్‌ఫ్లూ ప్రభావం చికెన్ అమ్మకాలు, ధరలపై కూడా పడింది... చికెన్ అమ్మకాలు పడిపోగా ధరలు కూడా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాధిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. బర్డ్‌ ఫ్లూ వైరస్ ‌కు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ వ్యాధితో ఇప్పటి వరకు మనుషులకు ఎలాంటి నష్టం జరగలేదని తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.