Begin typing your search above and press return to search.
జైల్లో భర్తను కలిసిన తర్వాత మాజీ డిఫ్యూటీ సీఎం భార్య ఎమోషన్
By: Tupaki Desk | 8 Jun 2023 10:00 AM GMTమన వ్యవస్థ ఎలా ఉంటుంది? అదెలా పని చేస్తుంది? కొన్నిసందర్భాల్లో కీలక స్థానాల్లోని వారు సైతం ఎంతలా ఇబ్బందులకు గురవుతుంటారు. మరికొన్ని సందర్భాల్లో సాదాసీదా వారు సైతం ఎంతలా చెలరేగిపోతారన్నది తెలిసిందే. అత్యుత్తమ స్థానాల్లో ఉండి కూడా.. ఇంతలా కష్టాలకు గురి కావటం చూసినప్పుడు కాసింత ఆశ్చర్యానికి గురి కాక మానదు. అలాంటి కోవలోకే వస్తుంది తాజా ఉదంతం.
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఉదంతాన్ని చూస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన్ను జైలుపాలు చేశారు. అది జరిగి ఇప్పటికి నాలుగు నెలలు అవుతుంది. ఆ స్థాయిలో ఉండి.. జైలుపాలు కావటం ఒక ఎత్తు అయితే.. ఇదే కేసులో తీవ్ర ఆరోపణలతో.. అరెస్టు ఖాయమన్న వార్తలు వెల్లువలా వచ్చి కూడా ఏమీ కాని వారు కనిపిస్తారు. అలాంటి వైచిత్రి మన వ్యవస్థలో తరచూ కనిపిస్తూ ఉంటుంది.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ ఉదంతంలో మరో విషయాన్ని ప్రస్తావించాలి. జైలు కెళ్లిన తర్వాత ఆయన.. తన కుటుంబ సభ్యులతో గడపటానికి 103 రోజుల సమయం పట్టింది. ఎన్నో ప్రయత్నాలు.. మరెన్నో కష్టాల అనంతరం.. జైల్లో ఉన్న భర్తను కలిశారు మనీశ్ సతీమణి సీమా.
ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు. రాజకీయ క్రీడలో జైలు పాలైన తన భర్తను 103 రోజుల తర్వాత కలిసిన విషయాన్ని ఆమె పేర్కొంటూ.. ''ఇన్నాళ్లు నేల మీద పడుకున్నా.. ఈగలూ.. దోమల బాధలు.. విపరీతమైన వేడి బాధలోనూ తన భర్త కళ్లలో ఆశయ సాధనను.. నిశ్చలత్వాన్ని చూశా'' అని పేర్కొన్నారు. మూడు నెలలకు పైనే తీహార్ జైల్లో ఉన్న ఆయన.. బెయిల్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా.. ఫలించకపోవటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్న భార్య సీమాను.. ఇతర కుటుంబ సభ్యులను వారింట్లో కలిసేందుకు ఢిల్లీ హైకోర్టు పలు షరతుల నడుమ అనుమతి పొందటం తెలిసిందే. కోర్టు ఉత్తర్వులతో ఇంటికి వచ్చిన తన భర్తతో బెడ్రూంలో మాట్లాడే మాటల్ని సైతం బయట ఉన్న పోలీసులు విన్న వైనాన్ని వెల్లడించారు. ఏడు గంటల పాటు కుటుంబ సభ్యులతో గడిపిన సందర్భంగా భర్తలో మనో నిబ్బరం తగ్గకపోవటాన్ని తాను గమనించినట్లుగాపేర్కొన్నారు. ఆమె పోస్టు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ట్వీట్ ను చూసినప్పుడు.. వ్యవస్థ తీరు మనసుకు అర్థం కాక మానదు.