Begin typing your search above and press return to search.

సిసోడియాపై బీజేపీ ప్రతీకారం ఇంతనా?

By:  Tupaki Desk   |   19 March 2023 8:00 AM GMT
సిసోడియాపై బీజేపీ ప్రతీకారం ఇంతనా?
X
ఢిల్లీ అసెంబ్లీని అస్తిరపరచాలనుకున్న బీజేపీ చేతికి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చిక్కలేదు. ఈ ఆరోపణలను స్వయంగానే ఆయనే చేశాడు. కేజ్రీవాల్ ను దించేసి తనను సీఎం చేయడానికి బీజేపీ ఆఫర్ ఇచ్చిందని.. తాను ఒప్పుకోకపోవడంతోనే అరెస్ట్ చేసి జైలుకు పంపిందని సిసోడియా ఆరోపించారు.

తాము ఆఫర్ ఇస్తే తీసుకోకుండా బీజేపీ పరువు తీసిన మనీష్ సిసోడియాను బీజేపీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరికించి జైలుకు పంపి ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఇప్పటికీ కూడా ఈడీ, సీబీఐ విచారణ పేరుతో సిసోడియాకు బెయిల్ రాకుండా చేస్తున్న వైనంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

తాజాగా సిసోడియాకు కోర్టు తాజాగా ఐదు రోజుల ఈడీ కస్టడీని పొడిగించింది. ఈనెల 22న తిరిగి కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది. ఇప్పటికే అనుమతించిన వారం రోజుల కస్టడీ ముగియడంతో స్పెషల్ జడ్జి నాగ్ పాల్ ముందు ఈడీ హాజరుపరిచింది. మరో వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరుఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే వారం పాటు కస్టడీలోకి తీసుకున్నా ఇంకా వివరాలను రాబట్టాలని వాదించడం అర్థరహితమన్నారు. సీబీఐ తరహా దర్యాప్తు జరుగుతున్నదని ఆరోపించారు. ఈడీ న్యాయవాది జోహెబ్ హొస్సెనీ స్పందిస్తూ రోజుకు కేవలం నాలుగైదు గంటలు మాత్రమే ప్రశ్నిస్తున్నామన్నారు. అన్ని వాదనలను పరిగణలోకి తీసుకున్న జడ్జి ఐదు రోజుల పాటు సిసోడియాను ఈడీ కస్టడీకి అనుమతిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈనెల 22న తిరిగి ఆయనను కోర్టులో హాజరు పరచాలన్నారు.