Begin typing your search above and press return to search.

భర్త కంటే ఎక్కువ చదివిన భార్య విడాకులు అడిగితే..

By:  Tupaki Desk   |   23 March 2016 12:16 PM IST
భర్త కంటే ఎక్కువ చదివిన భార్య విడాకులు అడిగితే..
X
ఒక ఆసక్తికర తీర్పును వెలువరించింది ఢిల్లీ కోర్టు ఒకటి. భర్త నుంచి విడాకులు తీసుకున్న భార్య.. తనకు నెలకు రూ.12వేలు చొప్పున భరణం చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించింది. అయితే.. దీనిపై విచారణ జరిపిన కోర్టు భార్యకు షాకిచ్చేలా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. తాజా కేసులో విడాకులు తీసుకున్న భార్య.. భర్త కంటే ఉన్నత విద్యావంతురాలు.

ఇదే విషయాన్ని ప్రస్తావించిన కోర్టు.. భర్త కంటే ఉన్నత చదువులు అభ్యసించి.. ఖాళీగా ఇంట్లో కూర్చొని మాజీ భర్త మీద భారం మోపటం సరికాదని వ్యాఖ్యానించింది. నెలకు రూ.12వేల భరణం కావాలని కోరిన భార్యకు షాకిస్తూ.. బాగా చదువుకొన్న ఆమెకు భరణం ఎందుకివ్వాలని ప్రశ్నించటమే కాదు.. ఖాళీగా ఎందుకు ఉండటం.. ఏదైనా పని చేయొచ్చు కదా అంటూ మహిళా న్యాయమూర్తి సూచన చేయటం గమనార్హం. వాస్తవానికి ఈ ఉదంతానికి సంబంధించి ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని భర్త జిల్లా కోర్టులో అప్పీలు చేయటం.. విచారణ సందర్భంగా మహిళా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.