Begin typing your search above and press return to search.

ఢిల్లీలో ఆ భార్యభర్తల కుట్ర తెలిస్తే.. వణికిపోతారంతే.

By:  Tupaki Desk   |   9 March 2020 5:37 AM GMT
ఢిల్లీలో ఆ భార్యభర్తల కుట్ర తెలిస్తే.. వణికిపోతారంతే.
X
అతగాడ్ని చూస్తే.. సగటు మధ్య వయస్కుడిగా కనిపిస్తాడు. ఎలాంటి అనుమానం కలుగదు. ఇక.. అతడి భార్యను చూస్తే.. అందమైన ఆ రూపాన్ని క్రిమినల్ కోణాన్ని ఊహించేందుకు సైతం మనసు ఇష్టపడదు. అలాంటి ఒక జంటకు సంబంధించిన దారుణమైన కుట్ర ప్లాన్ గురించి తెలిస్తే అవాక్కు కావటమే కాదు.. భయంతో వణకాల్సిందే. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలు ఉన్న దంపతుల్ని ఢిల్లీ స్పెషల్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

ఉలిక్కిపడేలా చేసిన ఈ ఉదంతంలోకి వెళితే.. ఢిల్లీలోని ఓక్లా ప్రాంతంలో జహన్ జీవ్ సామి.. అతని సతీమణి హిండా బషీర్ బేగ్ లను ఢిల్లీ స్పెషల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ సీనియర్ ఐఎస్ సానుభూతిపరులతో సంప్రదింపులు జరుపుతున్నారని.. ఢిల్లీలో భారీ పేలుకు వారు కుట్ర పన్నినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని ముస్లిం యువకుల్ని ప్రేరేపించి.. ఢిల్లీలో సీఏఏ అల్లర్లను పెంచేందుకు ప్రయత్నిస్తున్న వైనం బయటకు వచ్చింది.

అంతేకాదు.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేసిన వైనాన్ని పోలీసులు గుర్తించారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే వారిని ఆకర్షించేందుకు వీలుగా ఇండియన్ ముస్లిం యునైటెడ్ అనే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసి.. తమ పనికి అవసరమైన ముడిసరుకును తయారు చేసే పనిలో ఉండగానే.. పోలీసులు వీరిని గుర్తించి అదుపులోకి తీసుకోవటంతో పెను ప్రమాదం కాస్తలో తప్పిందని చెప్పక తప్పదు.