Begin typing your search above and press return to search.

ట్రాఫిక్ జాంలో లిప్ లాక్స్.. హగ్గింగ్స్

By:  Tupaki Desk   |   19 July 2016 9:55 AM GMT
ట్రాఫిక్ జాంలో లిప్ లాక్స్.. హగ్గింగ్స్
X
ఓ దేశంలో రోడ్డు పక్కనే శృంగారంలో పాల్గొంటూ వీడియోలకు దొరికిపోయింది ఓ జంట. ఇంకో దేశంలో కింద వాహనాలు వెళ్తుంటే పైన బ్రిడ్జి మీద సెక్స్ చేసుకుంటూ కనిపించింది మరో జంట. ఇలాంటివి విని.. ప్రపంచం ఎటు పోతోంది.. వాళ్లకసలు విలువలు లేవా.. అని తిట్టుకుంటూ ఉంటాం. కానీ భవిష్యత్తులో ఇండియాలో కూడా ఇలాంటి ఘటనలు జరిగితే ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు.

ఇప్పటికే పార్కుల్లో.. ప్రైవేట్ ప్లేసుల్లో అందరూ చూస్తుండగా ముద్దులాడుకోవడం మామూలైపోయింది. తాజాగా ఢిల్లీలో ఓ జంట అయితే మరీ హద్దులు దాటిపోయి.. నడిరోడ్డు మీద ట్రాఫిక్ జాంలో వాహనాలు ఆగిపోయి ఉండగా బైకు మీద రెచ్చిపోయి లిప్ లాక్స్ చేసుకుంటూ.. కౌగిలింతలు ఇచ్చుకుంటూ ప్రపంచాన్ని మరిచిపోయింది. అవతల రెడ్ సిగ్నల్ పడి.. వాహనాలు ఆగిపోయిన టైంలో ఓ జంట బైకుమీదే ఇలా రెచ్చిపోయింది.

చుట్టుపక్కన జనాలు చూసి ముక్కున వేలేసుకుంటుంటే.. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు ఆ ఇద్దరూ రెచ్చిపోయి ప్రవర్తించారు. ఆ జంటను ఎవ్వరూ ఆపే ప్రయత్నం చేయలేదు. ట్రాఫిక్ క్లియరయ్యే వరకు వాళ్లిద్దరూ తమ పనిలో తాము ఉండిపోయారు. ఇలాంటివి చూసినపుడే ఇండియాను ఇంకా అభివృద్ధి ‘చెందుతున్న’ దేశం అని ఎందుకంటున్నారో అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతకంటే డెవలప్మెంట్ ఏముంటుందిగనక?