Begin typing your search above and press return to search.

మోడీ రాకున్నా..సామాన్యుడు ఆయన్ను గుర్తు చేసుకున్నారు

By:  Tupaki Desk   |   16 Feb 2020 12:21 PM GMT
మోడీ రాకున్నా..సామాన్యుడు ఆయన్ను గుర్తు చేసుకున్నారు
X
ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశంలోని మరే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించకున్నా.. ప్రధాని మోడీని మాత్రం ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ను ఏ మాత్రం జీర్ణించుకోలేరన్నది బహిరంగ రహస్యం. ఎంతో కాలంగా తమకు కొరుకుడు పడని ఢిల్లీ కోట మీద కాషాయ జెండా రెపరెపలాడుతుంటే చూడాలని ఆయనెంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈసారి కూడా ఆయనకు నిరాశ తప్పలేదు.

అలా అని మనసులోని విషయాల్ని చెప్పుకోలేరు కాబట్టి.. హుందాతనం తగ్గకుండా ట్వీట్ తో గ్రీటింగ్స్ చెప్పేసి.. సామాన్యుడ్ని మెచ్చుకున్నారు. తద్వారా మోడీ మొనగాడు భయ్ అన్నట్లుగా వ్యవహరించారు. నిజానికి అదే మోడీ గొప్పతనం. ప్రత్యర్థుల్ని సైతం మెచ్చుకునేలా ఆయన కొన్ని చర్యలు ఉంటాయి. ట్వీట్ తో సామాన్యుడ్ని మెచ్చుకోవటం ద్వారా.. రాజకీయ శత్రువు గెలుపును ఎంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతారన్నట్లుగా ఆయన తీరు ఉంది.

ట్వీట్ తో క్రెడిట్ కొట్టేసే మోడీకి ఊహించిన షాకిచ్చారు కేజ్రీవాల్. తన ప్రమాణస్వీకారం ఎవరిని పిలవని ఆయన.. ప్రధాని మోడీని రావాలని కోరారు. ఇలాంటి వాటికి మోడీ వెళ్లకపోవటం మామూలే. ఆయన హాజరైతే ఆశ్చర్యం కానీ గైర్హాజరు ఊహించిందే కాబట్టి ఎవరూ పెద్దగా నిరాశ చెందలేదు. కాకుంటే.. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించారు సామాన్యుడు. ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ప్రధాని మోడీని ప్రస్తావించారు కేజ్రీవాల్.

తాను ఇదే వేదిక మీద నుంచి ఢిల్లీ డెవలప్ మెంట్ ప్రధాని మోడీ చేతుల్లో ఉందన్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోడీని పిలిచామని.. ఆయన వేరే పనుల్లో బిజీగా ఉండటం కారణంగా ఆయన రాలేకపోయారన్నారు. క్రేజీ ప్రమాణస్వీకారోత్సవానికి సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆఫ్ జెండాలు.. పతకాలు చేతబట్టి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎన్నికల్లో తాను సాధించిన విజయం తనది కాదని.. ప్రజల విజయంగా తేల్చారు. తన పాలనలో ఎవరిని ప్రత్యేకంగా పనులు చేయలేదని.. అందరికి సమానంగా పనులు చేశారన్నారు. మొత్తానికి తాను ఎంత బాగా చేసినా.. కేంద్రం దన్ను ఉండాలన్న విషయాన్ని ప్రస్తావిస్తూనే.. మోడీకి టైం చూసి మరీ సామాన్యుడు చురకలు వేశారని చెప్పక తప్పదు.