Begin typing your search above and press return to search.
ఆ సీఎం భద్రతను కేంద్రం తగ్గించిందా?
By: Tupaki Desk | 26 Feb 2021 4:16 AM GMTఏ మాత్రం అవకాశం లభించినా.. సుభాషితాలు వల్లించే ప్రధాని నరేంద్ర మోడీ మాటలకు చేతలకు మధ్య అంతరంపై చర్చ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. రాజకీయానికి పాలనకు ఎక్కడా లింకు చేయకూడదన్న విషయాన్ని కేంద్రం విస్మరిస్తుందా? అన్న సందేహం పలు రాష్ట్ర ప్రభుత్వాలు లేవనెత్తే సందేహాలతో మరింత పెరుగుతోంది. కేంద్రం తీరుపై బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ రాష్ట్ర అధికారపక్షం మరో అంశాన్ని ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చింది.
ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భద్రతను కుదించినట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఆరోపిస్తోంది. గుజరాత్ లోని సూరత్ లో ఈ రోజు (శుక్రవారం) కేజ్రీవాల్ రోడ్ షో ఉంది. ముఖ్యమంత్రికి కల్పించిన భద్రత తగ్గించారన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
గుజరాత్ స్థానిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశంసనీయమైన ఫలితాల్ని సాధించటంతో బీజేపీ నాయకత్వం కేజ్రీవాల్ భద్రతను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా కేజ్రీవాల్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కేజ్రీవాల్ సెక్యురిటీలోని ఢిల్లీ పోలీసులకు చెందిన ఆరుగురు కమాండోలు ఉండాల్సి ఉండగా రెండుకు తగ్గించినట్లుగా ఆరోపిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఆమ్ఆద్మీ పార్టీ వ్యాఖ్యల్ని కేంద్రం కొట్టిపారేస్తోంది. సీఎం భద్రతను తాము తగ్గించలేదని స్పష్టం చేస్తోంది. ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ ఖండిస్తోంది. ఆమ్ పార్టీ చేసే ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంటోంది. సాధారణ మార్పుల్లో భాగంగానే నలుగురు కమాండోలను మార్చామని.. వారి సంఖ్యను తగ్గించలేదని చెబుతోంది.
మరి.. ఇందులో నిజం ఎంతన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. ఇక్కడోవాస్తవాన్ని ప్రస్తావించాలి. గుజరాత్ స్థానిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతాలేమీ చేయలేదు. కాకుంటే.. తన ఉనికిని చాటుకుందని మాత్రమే చెప్పాలి. ఇరవైఏళ్ల పాలన తర్వాత కూడా బీజేపీకే గుజరాతీయులు భారీగా ఓట్లను.. సీట్లను కట్టబెట్టారని చెప్పక తప్పదు.