Begin typing your search above and press return to search.
కేజ్రీని సుఖేష్ వెంటాడుతున్నాడా ?
By: Tupaki Desk | 7 May 2023 1:00 PM GMTఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ను జైలులో కూర్చున్న సుఖేష్ చంద్రశేఖరన్ వెంటాడుతున్నట్లే ఉన్నాడు. జైలులో హ్యాపీగా కూర్చుని సర్వసుఖాలు అనుభవిస్తున్న సుఖేస్ బయట తనతో సన్నిహితంగా ఉన్నారంటు కొందరు నేతలను వేటాడుతున్నారు. వారానికో పదిరోజులకో ఒక లెటర్ విడుదల చేయటం తాను వాళ్ళకి డబ్బులిచ్చానని, వీళ్ళకి డబ్బులిచ్చానంటు గోలచేస్తున్నారు. తాను డబ్బులిచ్చినందుకు సాక్ష్యాలంటు కొన్ని వాట్సప్ ఛాటింగులను కూడా రిలీజ్ చేస్తున్నాడు.
ఇపుడిదంతా ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ కొత్త ఇంటికోసం తాను రు. 1.70 కోట్లు ఖర్చుచేసినట్లు ఆరోపించాడు. రు. 1.70 కోట్ల వివులైన ఫర్నీచర్ ను తానే కొనుగోలు చేసి తన అసిస్టెంట్ రిషబ్ షెట్టి ద్వారా కేజ్రీ ఇంటికి చేర్చినట్లు చెప్పాడు. రు. 45 లక్షలతో 12 సీట్ల డైనింగ్ టేబుల్, రు. 34 లక్షలతో డ్రెస్సింగ్ టేబుల్, రు. 18 లక్షలతో అద్దాలు, 28 లక్షల రూపాయలతో బెడ్ రూమ్ సామగ్రి, 45 లక్షల రూపాయలతో గోడ గడియారాలు కొన్నట్లు చెప్పాడు.
ఢిల్లీ, ముంబాయ్, ఇటలీ, ఫ్రాన్స్ కు చెందిన ఫర్నీచర్ ను తాను కొనుగోలు చేసి కేజ్రీ ఇంటికి చేర్చినట్లు చెప్పాడు. ఫర్నీచర్ కొనుగులోకు సంబంధించి కేజ్రీకి తనకు వాట్సప్ చాటింగ్, ఫేస్ బుక్ సంభాషణలు తన దగ్గర ఉన్నాయని చెప్పాడు. అవసరమని అనుకుంటే వాటన్నింటితో పాటు ఫర్నీచర్ కొనుగోలుకు సంబంధించిన బిల్లులను కూడా అందచేస్తానన్నాడు.
కేజ్రీ ఇంటికి మనీల్యాండరింగ్, హవాలా మోసాల్లో ఇరుక్కున్న సుఖేస్ ఫర్నీచర్ కొనుగోలు చేయటం ఏమిటో అర్ధంకావటంలేదు. కేజ్రీ మీద ఇప్పటివరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. మొదటిసారిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోనే కేజ్రీ పేరు వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఇపుడు సుఖేష్ చేసిన ఆరోపణలు నిజమో కాదో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీదే ఉంది. ఇప్పటికే ఇలాంటి ఆరోపణలను కల్వకుంట్ల కవిత మీద కూడా సుఖేష్ చేసిన విషయం తెలిసిందే. తనకు కవితకు మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్ ను కూడా సుఖేష్ బయటపెట్టాడు. అయితే సుఖేష్ ఎవరో తనకు తెలీదని కవిత ప్రకటించారు. మరి తాజా ఆరోపణలు ఎక్కడికి దారితీస్తాయో చూడాల్సిందే.