Begin typing your search above and press return to search.
కేజ్రీ సర్కార్ అనూహ్య నిర్ణయం.. ఆ దమ్ము తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఉందా?
By: Tupaki Desk | 31 July 2020 4:00 AM GMTప్రజా సంక్షేమం కోసం వేలాది కోట్ల రూపాయిల్ని ఖర్చు చేస్తున్నట్లుగా చెబుతుంటాయి ప్రభుత్వాలు. అదే సమయంలో.. ప్రజల నుంచి ముక్కుపిండి మరీ పన్ను వసూళ్లకు పాల్పడుతున్న వైనాన్ని చూస్తున్నదే. కరోనా పుణ్యమా అని ప్రభుత్వ ఆదాయాలు పూర్తిగా తగ్గిపోవటంతో ఇప్పుడంతా ఆదాయం వచ్చే మార్గాల మీద ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వారికి కనిపిస్తున్నవి రెండే.. అందులో ఒకటి మద్యం అమ్మకాలైతే.. రెండోది పెట్రోల్.. డీజిల్ మీద వచ్చే వ్యాట్ పన్ను.
దీంతో.. ఎంత అవకాశం ఉంటే.. అంతగా లాగేయటమే కాదు.. కొత్తగా వడ్డిస్తున్న తీరుతో పెట్రోల్ డీజిల్ ధరలు లీటరు ఏకంగా 80ప్లస్ కు చేరుకున్నాయి. మిగిలిన ధరలు ఎలా ఉన్నా.. పెట్రోల్.. డీజిల్ ధరల పెరుగుదల సామాన్యుడి జీవితం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయన్నది మర్చిపోకూడదు. ఇలా.. అన్ని ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న వేళ.. ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కారు అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. గతానికి భిన్నంగా ఇటీవల ఆ రాష్ట్రంలో పెట్రోల్ తో పోలిస్తే.. డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.
దీంతో.. గురువారం సమావేశమైన మంత్రివర్గం కీలకనిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటివరకు పెట్రోల్.. డీజిల్ మీద వసూలు చేస్తున్న వ్యాట్ పన్నును 30 శాతం నుంచి 16.75 శాతానికి తగ్గిస్తూ అనూహ్య నిర్ణయాన్ని తీసుకన్నారు. దీంతో.. లీటరుకు రూ.8 మేర పన్ను తగ్గనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాట్ ను ఇంత భారీగా తగ్గించటం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రజల మీద భారం పడకుండా ఉండేందుకు వీలుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు భారీగా ధరలు పెరిగిన నేపథ్యంలో.. ప్రజా సంక్షేమ పథకాలతో తరచూ చెలరేగిపోయే ఇద్దరు సీఎంలు కేజ్రీవాల్ సర్కారు మాదిరి నిర్ణయం తీసుకునే దమ్ము ఉందా? అన్నది ప్రశ్న. అదే జరిగితే.. తగ్గే ధరలతో సామాన్యుడి నుంచి మధ్యతరగతి జీవి వరకూ ఊపిరి పీల్చుకునే వీలుంది.