Begin typing your search above and press return to search.

పార్టీ ఆఫీసులో భార్యను చితకబాదిన బీజేపీ నేత

By:  Tupaki Desk   |   20 Sept 2019 3:47 PM IST
పార్టీ ఆఫీసులో భార్యను చితకబాదిన బీజేపీ నేత
X
అది ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ హాజరయ్యారు. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గురించి సీరియస్ బీజేపీ నాయకులతో సీరియస్ గా చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఢిల్లీలోని మెహ్రోలీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అజాద్ సింగ్ హాజరయ్యాడు. అంతలోనే కలకలం.. అజాద్ సింగ్ భార్య సమావేశానికి రావడం.. ఆమెను చూడగానే శివాలెత్తిపోయిన ఆజాద్ సింగ్ ఆమె జుట్టు పట్టుకొని పార్టీ ఆఫీసులోనే అందరు నేతల ముందు చితకబాదడం కలకలం రేపింది. ఈ హఠాత్ పరిణామానికి అవాక్కయ్యారు కేంద్ర మంత్రి జవదేకర్, బీజేపీ నేతలు.

ఢిల్లీలో ఎన్నికల సమాయత్తంలో భాగంగా బీజేపీ కార్యాలయంలో సమావేశం పెట్టగా మెహ్రోలీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అజాద్ సింగ్ హాజరయ్యారు. ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సరితా చౌదరితో విభేదాలున్నాయి. విడాకుల కోసం ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. ఆజాద్ సింగ్ భార్య కూడా ఢిల్లీ మాజీ మేయర్. దీంతో సమావేశానికి వచ్చిన సరితను చూసిన ఆజాద్ సింగ్ కోపంతో రగిలిపోయాడు. నిన్ను ఎవరు రానిచ్చారు అంటూ ఆమె మీద చేయి చేసుకొని చితకబాదాడు.

అక్కడే ఉన్న బీజేపీ నాయకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. బీజేపీ నేతల పరువు పోయింది. దీని దెబ్బకు వెంటనే అతడిని జిల్లా అధ్యక్ష పదవినుంచి తొలగిస్తున్నట్టు కేంద్రమంత్రి జవదేకర్ ప్రకటించారు.