Begin typing your search above and press return to search.

‘డైనింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా ఢిల్లీ..: ‘డైన్ అవుట్’ నివేదిక

By:  Tupaki Desk   |   6 Jan 2022 12:30 PM GMT
‘డైనింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా ఢిల్లీ..: ‘డైన్ అవుట్’  నివేదిక
X
ఖర్చు కొంచెం కష్టమైనా సరే.. ఇష్టమైన ఆహారాన్ని తినడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. ఇంట్లో వంటలు చేసుకోలేనివారు.. కొత్త కొత్త రుచులను ఆస్వాదించాలానుకునేవాళ్లు రెస్టారెంట్ల బాట పడుతారు. రెస్టారెంట్ల యజమానులు సైతం భోజన ప్రియులను ఆకర్షించేందుకు ఘుమఘుమలాడే వంటకాలను తయారు చేస్తున్నారు. అయితే గతేడాది రెస్టారెంట్లను సందర్శించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏడాది మొత్తంలో ఎక్కువ మంది ఇంటి ఫుడ్ కంటే రెస్టారెంట్ ఫుడ్ తినడానికే ఇష్టపడ్డారు. ‘డైన్ అవుట్’ అనే ఓ సంస్థ ఫుడ్ లవర్స్ పై ఓ సర్వే చేసింది. ఆ తరువాత నివేదికను బయటపెట్టింది. 2021 సంవత్సరంలో దేశంలో 4.5 కోట్ల మంది రెస్టారెంట్లకు వెళ్లి తమకిష్టమైన ఆహారాన్ని తిన్నారట.

‘డైన్ అవుట్’ ఇచ్చిన నివేదిక ప్రకారం 2021 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 4.5 కోట్ల మంది రెస్టారెంట్లకు విళ్లి రకరకాల పదార్థాలను తిన్నారు. ఇందులో వీరు చెల్లించిన ఒక్కో బిల్లు సగటున రూ.2,670 గా ఉంది. ఇదే 2020లో రూ.1,0907గా ఉంది. అంటే గతేడాదితో పోలిస్తే రూ.12,015 కోట్లు ఆహారంపై ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక రెస్టారెంట్లలో టేబుళ్ల ద్వారా బుక్ చేసుకోవడం ద్వారా వీరు రూ.1,360 కోట్లను ఆదా చేసుకున్నట్లు నివేదికలో తెలిపారు. మరోవైపు గంటకు 8,588 మంది టేబుళ్లు రెస్టారెంట్లలో బుక్ అయినట్లు డైన్అవుత్ తెలిపింది.

‘డైన్ అవుట్’ అనే సంస్థ ఢిల్లీని ‘డైనింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ గా పేర్కొంది. ఎందుకంటే డైన్ అవుట్ ఇస్తున్న నివేదికలో ఢిల్లీ వరుసగా మొదటి ప్లేసులో వస్తోంది. దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో 32 వాతం మంది రెస్టారెంట్ల భోజన ప్రియులు ఇక్కడే ఉన్నారు. ఆ తరువాత బెంగుళూరు18 శాతంతో రెండో స్థానంలో ఉంది. చికెన్ బటర్, దాల్ ముఖాని, నాన్ ఎక్కువగా తీసుకున్నారు. 38 శాతం ఉత్తరాది ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వగా.. చైనీస్ వంటకాలకు 18 శాతం, కాంటినెంటల్ వంటకాలకు 16 శాతం ప్రాధాన్యత ఇచ్చారు.

ఫ్యామిలీ జంటల కంటే లవ్ కపుల్స్ ఎక్కువగా రెస్టారెంట్లలో ఆహారాన్ని తీసుకున్నారు. ఈ విషయంలో ఉదయ్ పూర్ ముందంజలో ఉంది. ఈ పట్టణంలోని 44 శాతం బుకింగ్స్ కేవలం లవర్స్ కోసమే చేసుకున్నట్లు తేలింది. కుటుంబ సభ్యులు, స్నేమితుల బృందాలు ఎక్కువగా ఆగ్రా, లుథియానాలో రెస్టారెంట్లలో బుక్ చేసుకున్నారు. ఇక ఖరీదైన ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఖరీదైన ఆహారం విక్రయం 120 శాతం పెరిగినట్లు తెలిపింది. నాణ్యమైన రెస్టారెంట్లలో భోజనాలు కూడా 105 శాతం పెరిగాయి.

ఇక ఆగ్రా రెస్టారెంట్లలో డిన్నర్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. అంటే రాత్రిపూట రెస్టారెంట్లలో భోజనం చేయడానికి ఎక్కువగా ఇష్టపడ్డారు. ఈ విషయంలో ఆగ్రాలో 59.3 శాతం మంది ప్రిఫరెన్స్ ఇచ్చారు. కాగా చెన్నై వాసులు 47 శాతం మంది మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఫుడ్ తో పాటు లిక్కర్ తీసుకునే వారిపై కూడా ‘డైన్ అవుట్’ సర్వే చేసింది. ఈ విభాగంలో బెంగుళూరు మొదటి స్థానంలో నిలిచింది. బెంగూళూరులో ఈ ఏడాది 50 వేల లీటర్ల ఆల్కహాల్ వినియోగించుకుంది. దీంతో 2021 లిక్కర్ రాజధానిగా బెంగుళూరును ప్రకటించారు.