Begin typing your search above and press return to search.

పొగ- మంచు క‌ష్టాలు.. ఢిల్లీకే కాదు - సిడ్నీకి కూడా!

By:  Tupaki Desk   |   11 Dec 2019 1:30 AM GMT
పొగ- మంచు క‌ష్టాలు.. ఢిల్లీకే కాదు - సిడ్నీకి కూడా!
X
ఇటీవ‌లి కాలంలో ఢిల్లీ మ‌హాన‌గ‌రం పొగ మంచుతో ప‌డుతున్న ఇబ్బందులు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ ప‌క్క రాష్ట్రాలు పంజాబ్, హ‌ర్యానాల్లో రైతులు భారీ ఎత్తున పంట‌ల‌ను కాల్చ‌డంతో ఢిల్లీ న‌గ‌రాన్ని అందుకు సంబంధించిన పొగ చుట్టుముట్టింది. ఆపై శీతాకాలం కావ‌డంతో ఆ పొగ మంద‌గ‌మ‌నంలోకి ప‌డిపోయింది. దీంతో కాలుష్యం క‌ష్టాలు ఢిల్లీని చుట్టుముట్టాయి.

ఈ విష‌యంలో అన్ని వైపుల నుంచి ఆందోళ‌న వ్య‌క్తం అయ్యింది. ఢిల్లీలో ఊపిరి తీసుకోవ‌డం అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారిన‌ట్టుగా ప‌రిశోధకులు స్ప‌ష్టం చేశారు. ప్ర‌తియేటా రైతులు పంట‌ల‌ను కాల్చ‌డం వ‌ల్ల‌నే ఢిల్లీ ఈ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనాల్సి వ‌స్తోంద‌నే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అందుకు గానూ పంజాబ్, హ‌ర్యానా ప్ర‌భుత్వాలు న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు ప్రారంభించాయి.

ఇక ఢిల్లీలో జ‌న‌జీవ‌నం తీవ్ర ఇబ్బందుల పాల‌య్యింది. విశేషం ఏమిటంటే.. ఇప్పుడు మ‌రో న‌గ‌రంలో కూడా అలాంటి ప‌రిస్థితి త‌లెత్తింది. అది ఆస్ట్రేలియాలోని ప్ర‌ముఖ న‌గ‌రం సిడ్నీ.

సిడ్నీ కూడా పొగ మంచుతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంది. ఈ విష‌యాన్ని అక్క‌డి ప్ర‌ముఖులు వాపోతున్నారు. సిడ్నీలో కాలుష్య తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంద‌ని, అక్క‌డ శ్వాస తీసుకోవ‌డం కూడా క‌ష్టంగా మారింద‌ని అక్క‌డి వారు వాపోతూ ఉన్నారు. సిడ్నీలో ఒక రోజు ఉండ‌టం అంటే.. ఎన‌భై సిగ‌రెట్లు తాగ‌డంతో స‌మానంగా మారింద‌ని ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్లు కూడా వాపోతున్నారు.

ఢిల్లీలో ప‌రిస్థితుల‌ను వారు గుర్తు చేస్తూ ఉన్నారు. సిడ్నీ త‌మ‌కు ఢిల్లీని గుర్తు చేస్తూ ఉంద‌ని వారు చెబుతున్నారు. కాలుష్య తీవ్ర‌త ప‌ట్ల తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ ఉన్నారు.